Nayanthara: రొమాంటిక్‌గా పెళ్లి డాక్యుమెంటరీ.. టీజర్ విడుదల..

ABN , First Publish Date - 2022-09-24T20:55:59+05:30 IST

సెలబ్రిటీ లవ్ బర్డ్స్ నయనతార (Nayanthara), విఘ్నేశ్ శివన్‌ (Vignesh Shivan) జూన్ 9న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మహాబలిపురంలోని ప్రముఖ రిసార్ట్‌లో వీరి వివాహం అత్యంత ఘనంగా

Nayanthara: రొమాంటిక్‌గా పెళ్లి డాక్యుమెంటరీ.. టీజర్ విడుదల..

సెలబ్రిటీ లవ్ బర్డ్స్ నయనతార (Nayanthara), విఘ్నేశ్ శివన్‌ (Vignesh Shivan) జూన్ 9న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మహాబలిపురంలోని ప్రముఖ రిసార్ట్‌లో వీరి వివాహం అత్యంత ఘనంగా జరిగింది. ఈ పెళ్లిని డాక్యుమెంటరీ రూపంలో తెరకెక్కించారు. ‘నయనతార: బియండ్ ఫెయిరీ టేల్’ (Nayanthara: Beyond the Fairy Tale) పేరుతో రూపొందించారు. గౌతమ్ మీనన్ (Gautham Menon) దర్శకత్వం వహించాడు. ఈ డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌(Netflix)లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా అందుకు సంబంధించిన టీజర్‌ను నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది. ఈ టీజర్‌ రొమాంటిక్‌గా సాగింది. టీజర్‌లో.. నయనతార వ్యక్తిగత జీవితాన్ని కొంత భాగం చూపించారు. విఘ్నేశ్ ఏ విధంగా నయన్‌తో ప్రేమలో పడిన విధానాన్ని పంచుకున్నాడు. ‘నయనతార: బియండ్ ఫెయిరీ టేల్’ స్ట్రీమింగ్ డేట్‌ను మాత్రం నెట్‌ప్లిక్స్ ప్రకటించలేదు. 


నయన్ డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించిన గౌతమ్ మీనన్ కొన్ని రోజుల క్రితం మీడియాతో మాట్లాడాడు. నయన్ డాక్యుమెంటరీకి సంబంధించిన విశేషాలను తెలిపాడు. ‘‘నయనతార పెళ్లిని డాక్యుమెంటరీ రూపంలో ప్రేక్షకులకు చూపించనున్నాం. చిన్నతనం నుంచి పెళ్లి వరకు ఆమె ప్రయాణాన్ని తెరకెక్కించాం. నయన్ చిన్నతనం నాటి ఫొటోలను కూడా చూపిస్తాం’’ అని గౌతమ్ మీనన్ తెలిపాడు. నయన్, విఘ్నేశ్ శివన్ పెళ్లికి సంబంధించిన ఖర్చులను నెట్‌ఫ్లిక్సే చూసుకుందని, ఈ వేడుక డిజిటల్ రైట్స్ కోసం నయనతారకు రూ. 25కోట్లు చెల్లించిందని సమాచారం. అతిథుల కోసం నయన్ మహాబలిపురం ఫైవ్ స్టార్ హోటల్‌లోని అన్ని గదులను బుక్ చేసిందట. ఈ వేడుక కోసం ఓ గ్లాస్ ప్యాలెస్‌ను కూడా నిర్మించారని కథనాలు వెలువడ్డాయి. ఒక ప్లేట్ భోజనానికి రూ.3500లను చెల్లించారని తెలుస్తోంది. ఖరీదైన మేకప్ ఆర్టిస్టులు, ముంబై నుంచి వచ్చిన సెక్యూరిటీ గార్డులు కోసం భారీగానే ఖర్చు చేశారట.



Updated Date - 2022-09-24T20:55:59+05:30 IST