నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు
ABN , First Publish Date - 2022-01-17T06:30:12+05:30 IST
నవీన్ పోలిశెట్టి హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించే చిత్రానికి ‘అనగనగా ఒక రాజు’ అని పేరు నిర్ణయించారు....

నవీన్ పోలిశెట్టి హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించే చిత్రానికి ‘అనగనగా ఒక రాజు’ అని పేరు నిర్ణయించారు. సంక్రాంతి సందర్భంగా పేరుతో కూడిన ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ఈ చిత్రంతో కల్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వినోద భరితంగా రూపుదిద్దుకునే ఈచిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. సూర్యదేవర నాగవంశీ, శ్రీమతి సాయి సౌజన్య నిర్మించే ఈ చిత్రానికి పీడీవీ ప్రసాద్ సమర్పకుడు. తమన్ సంగీత దర్శకుడు.