Naveen Mullangi: పాన్ వరల్డ్ మూవీతో ఖమ్మం కుర్రాడు సంచలనం
ABN, First Publish Date - 2022-11-24T04:00:45+05:30
తెలుగు సినిమాలు వంద కోట్లు సంపాదిస్తేనే ఎగిరి గంతేస్తున్నాం.. కానీ, ఇంగ్లీష్ సినిమాలు వేల, లక్షల కోట్లు గడిస్తుండడం నుంచి మనం స్ఫూర్తి పొందలేకపోతున్నామని
తెలుగు సినిమాలు వంద కోట్లు సంపాదిస్తేనే ఎగిరి గంతేస్తున్నాం.. కానీ, ఇంగ్లీష్ సినిమాలు వేల, లక్షల కోట్లు గడిస్తుండడం నుంచి మనం స్ఫూర్తి పొందలేకపోతున్నామని అంటున్నాడు తెలంగాణ చిచ్చరపిడుగు నవీన్ ముళ్లంగి (Naveen Mullangi). బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ చేసి, ఓ మల్టీ నేషనల్ కంపెనీలో జాబ్ చేస్తున్న ఈ పాతికేళ్ల ఖమ్మం కుర్రాడు.. హీరో కమ్ రైటర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్‌గా ఇంగ్లీషులో ఓ ఫీచర్ ఫిల్మ్ చేసి.. ట్రెండ్ సెట్ చేసేందుకు సమాయత్తమవుతున్నాడు. పరస్పర విరుద్ధమైన భావజాలం కలిగిన ఓ అబ్బాయి - అమ్మాయి నడుమ నడిచే యునిక్ లవ్‌స్టోరీగా ‘కమ్యూనిస్ట్ గర్ల్ ఫ్రెండ్ - క్యాపిటలిస్ట్ బోయ్ ఫ్రెండ్’ (Communist Girlfriend Capitalist Boyfriend) పేరుతో నవీన్ ముళ్ళంగి తీసిన ఈ చిత్రం షూటింగ్‌తో పాటు... పోస్ట్ ప్రొడక్షన్ పనులు సైతం పూర్తి చేసుకుంది. గంటన్నర నిడివి గల ఈ చిత్రం ట్రైలర్ త్వరలో విడుదల కానుంది.
ఓ సినిమా రూపకల్పనకు అవసరమైన పలు సాంకేతిక అంశాల్లోనూ సుశిక్షితుడిగా తనను తాను తీర్చిదిద్దుకున్న నవీన్.. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ కలిగిన ఇంగ్లీషులో సినిమాలు తీసి.. తన సత్తా చాటుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. వాటర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పేరుతో బ్యానర్ స్టార్ట్ చేసి.. తెరకెక్కించిన ‘కమ్యూనిస్ట్ గర్ల్ ఫ్రెండ్ - క్యాపిటలిస్ట్ బోయ్ ఫ్రెండ్’ చిత్రంలో నవీన్ సరసన శివ ప్రీతిక సుక్క హీరోయిన్‌గా నటించింది. ఇలియాజ్ సినిమాటోగ్రఫీ అందించారు.