సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

దురదపుడితే గోక్కుంటాం కానీ, తోలు పీకేసుకోం కదా : నవదీప్

ABN, First Publish Date - 2022-01-23T20:43:15+05:30

కొంత కాలంగా నవదీప్ హీరో వేషాలు మానేసి.. ప్రధాన పాత్రలు చేస్తు్న్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ చిత్రంలోనూ, మంచు విష్ణు ‘మోసగాళ్ళు’ మూవీలోనూ నవదీప్ ముఖ్యపాత్రలు పోషించాడు. ప్రస్తుతం సన్నీలియోన్ కథానాయికగా నటిస్తోన్న ‘వీరమాదేవి’ చిత్రంలో కీలక పాత్ర చేస్తున్నాడు. 17 ఏళ్ళ క్రితమే టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నవదీప్.. ఇప్పటికీ ఇంకా పెళ్ళి చేసుకోకుండా టాలీవుడ్ బ్యాచులర్స్ లిస్ట్ లోకి చేరిపోయాడు. గెడ్డం నెరిసిపోవడంతో సోషల్ మీడియాలో అతడిపై ట్రోల్స్ చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొంత కాలంగా నవదీప్ హీరో వేషాలు మానేసి.. ప్రధాన పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ చిత్రంలోనూ, మంచు విష్ణు ‘మోసగాళ్ళు’ మూవీలోనూ నవదీప్ ముఖ్యపాత్రలు పోషించాడు. ప్రస్తుతం సన్నీలియోన్ కథానాయికగా నటిస్తోన్న ‘వీరమాదేవి’ చిత్రంలో కీలక పాత్ర చేస్తున్నాడు.  17 ఏళ్ళ క్రితమే టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నవదీప్.. ఇప్పటికీ ఇంకా పెళ్ళి చేసుకోకుండా టాలీవుడ్ బ్యాచులర్స్ లిస్ట్ లోకి చేరిపోయాడు. గెడ్డం నెరిసిపోవడంతో  సోషల్ మీడియాలో అతడిపై ట్రోల్స్ చేస్తున్నారు. 


వాటిపై నవదీప్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా సెటైరికల్ గా స్పందిస్తూ ఓ వీడియో పోస్ట్ చేశాడు. వద్దురా సోదరా అనే హెడ్డింగ్ పెట్టి..  ‘అన్నా నీ గెడ్డం తెల్లబడుతోంది. తొందరగా పెళ్ళి చేసుకోమని నాకు సలహాలిస్తున్నారు. గెడ్డం తెల్లబడితే చేసుకోవల్సింది ట్రిమ్మింగ్ కానీ,  పెళ్ళి కాదు. దురదపుడితే గోక్కుంటాం కానీ, తోలుపీకేసుకోం కదా అలాగే ’ అంటూ తన పెళ్ళిపై తనే సెటైర్స్ వేసుకున్నారు. నవదీప్ షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది. 



Updated Date - 2022-01-23T20:43:15+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!