సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘లవ్‌మౌళి’ గా నవదీప్ 2.0

ABN, First Publish Date - 2022-01-26T20:52:37+05:30

‘జై’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు టాలెంటెడ్ హీరో నవదీప్. తేజ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అంతగా ఆడలేకపోయినప్పటికీ.. అవకాశాలు మాత్రం బాగానే అందుకున్నాడు నవదీప్. ఆ తర్వాత కొన్ని చిత్రాలతో సక్సెస్ అందుకున్న నవదీప్.. ఆపై విలన్ గానూ టర్న్ అయ్యాడు. బిఫోర్ లాస్టియర్ ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో చిన్న పాత్రలో నటించిన నవదీప్‌కు ఇప్పుడు తనను తాను కొత్తగా ఆవిష్కరించుకొనే ప్రయత్నం చేస్తున్నాడు. ‘లవ్‌మౌళి’ అనే విభిన్నతరహా చిత్రంతో నవదీప్ 2.0 గా పరిచయం అవుతున్నాడు. అవనీంద్ర అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘జై’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు టాలెంటెడ్ హీరో నవదీప్. తేజ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అంతగా ఆడలేకపోయినప్పటికీ.. అవకాశాలు మాత్రం బాగానే అందుకున్నాడు నవదీప్. ఆ తర్వాత కొన్ని చిత్రాలతో సక్సెస్ అందుకున్న నవదీప్.. ఆపై విలన్ గానూ టర్న్ అయ్యాడు. బిఫోర్ లాస్టియర్ ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో చిన్న పాత్రలో నటించిన నవదీప్‌ ఇప్పుడు తనను తాను కొత్తగా ఆవిష్కరించుకొనే ప్రయత్నం చేస్తున్నాడు. ‘లవ్‌మౌళి’ అనే విభిన్నతరహా చిత్రంతో నవదీప్ 2.0 గా పరిచయం అవుతున్నాడు.  అవనీంద్ర అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ రోజు (బుధవారం)  నవదీప్ బర్త్ డే సందర్భంగా ‘లవ్‌మౌళి’ మోషన్ పోస్టర్ ను రానా దగ్గుబాటి చేతులమీదుగా ఆవిష్కరించారు మేకర్స్.  


జడలు కట్టిన కేశాలతో, సిక్స్ ప్యా్క్ బాడీతో సాధువును తలపించే గెటప్‌లోని నవదీప్ తేనెను తాగుతున్న లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘మరుదనాయకం’ అనే ఆగిపోయిన సినిమా కోసం కమల్ హాసన్, ‘ఏకవీర’ చిత్రంలో ఆది పినిశెట్టి ఇలాంటి గెటప్స్ లోనే కనిపించారు. పంఖురి గిద్వాన్ కథానాయికగా నటిస్తోంది. మరి లవ్  మౌళిగా నవదీప్ చేయబోయే మ్యాజిక్ ఎలా ఉండబోతుందో చూడాలి. 



Updated Date - 2022-01-26T20:52:37+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!