మేము బ్లాక్ బస్టర్ తీశాం.. ఇక మీ ఇష్టం: Natural Star Nani

ABN , First Publish Date - 2022-06-04T03:05:43+05:30 IST

‘‘మంచి సినిమా తీశాం.. మీరు చూసి హిట్ చేయాలని చెప్పడం లేదు.. మేము బ్లాక్ బస్టర్ తీశాం.. ఇక ఈ సినిమాని ఎక్కడి తీసుకెళతారనేది మీ ఇష్టం..’’ అని అన్నారు న్యాచురల్ స్టార్ నాని (Natural Star Nani ). నాని హీరోగా వివేక్ ఆత్రేయ (Vivek Athreya) దర్శకత్వంలో..

మేము బ్లాక్ బస్టర్ తీశాం.. ఇక మీ ఇష్టం: Natural Star Nani

‘‘మంచి సినిమా తీశాం.. మీరు చూసి హిట్ చేయాలని చెప్పడం లేదు.. మేము బ్లాక్ బస్టర్ తీశాం.. ఇక ఈ సినిమాని ఎక్కడి తీసుకెళతారనేది మీ ఇష్టం..’’ అని అన్నారు న్యాచురల్ స్టార్ నాని (Natural Star Nani ). నాని హీరోగా వివేక్ ఆత్రేయ (Vivek Athreya) దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అంటే సుందరానికీ’ (Ante Sundaraniki). ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుకను తాజాగా వైజాగ్‌(Vizag)లో అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాని,  హీరోయిన్ నజ్రియా (Nazriya Fahadh), నిర్మాత వై రవి శంకర్ (Ravi Shankar Y) పాటు చిత్ర బృందం పాల్గొన్ని చిత్ర విశేషాలను తెలియజేశారు.


ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ.. ‘‘వైజాగ్ మా అత్తగారి ఊరు. వైజాగ్‌కి అల్లుడు వచ్చాడు. సాధారణంగా అల్లుడు వచ్చినపుడు అతనికి విందు భోజనం అత్తగారు పెడతారు. కానీ జూన్ 10న అల్లుడే విందు భోజనం పెడతాడు. బేసిగ్గా సినిమా విడుదలకు ముందు మంచి సినిమా తీశాం, మంచి హిట్ చేయాల్సింది మీరే అని చెప్తుంటాం.. కానీ ఈసారి అలా కాదు.. మేము బ్లాక్ బస్టర్ తీశాం.. ఇంక దాన్ని ఎక్కడి తీసుకెళ్తారో మీ ఇష్టం. జూన్ 10 నుండి  ‘అంటే సుందరానికీ’ మీది. ఒక సినిమా విజయానికి యాక్షన్, హ్యుమర్, ఎమోషన్ కారణం. ఏడాదిగా యాక్షన్ కావలసినంత దొరికింది. హ్యుమర్, ఎమోషన్ కోసం ప్రేక్షకులు ఆకలితో ఎదురుచూస్తున్నారు. జూన్ 10న వస్తున్న ఈ చిత్రం.. థియేటర్‌లో కావాల్సినంత హ్యుమర్, ఎమోషన్ పండిస్తుంది. నన్ను మీ ఫ్యామిలీలో ఒకరిగా చూస్తున్న ప్రేక్షకులకు..ఎప్పటికీ రుణపడి వుంటాను. ఈ సినిమా చాలా బ్యూటీఫుల్‌గా వుంటుంది. ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తారు. వైజాగ్ సముద్రంలాగా హ్యుమర్, ఎమోషన్ ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే వుంటాయి. మైత్రీ మూవీ మేకర్స్‌తో నాకిది రెండో సినిమా. ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుంది. ఈ సినిమా తర్వాత అంటే.. దీనిని మించిన సినిమా చేయాలి, చేస్తామని నమ్ముతున్నాను. ఈ సినిమాకి పనిచేసిన టెక్నికల్ టీంకి కృతజ్ఞతలు. నజ్రియా ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకుంది. లీల పాత్రలో తనని తప్ప ఎవరినీ ఊహించుకోలేరు. మీ అందరితో కలిసి ఎప్పుడెప్పుడు సినిమా చూస్తానా అని ఎంతగానో ఎదురుచూస్తున్నాను. జూన్ 10న కలుద్దాం..’’ అని అన్నారు.Updated Date - 2022-06-04T03:05:43+05:30 IST

Read more