సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

అందుకే వర్మకి షాక్ ఇచ్చా: నట్టి కుమార్

ABN, First Publish Date - 2022-04-08T03:06:40+05:30

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన చిత్రం ‘మా ఇష్టం’(డేంజరస్). హిందీలో ‘ఖత్రా’ అనే టైటిల్‌తో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం ఏప్రిల్ 8న విడుదల కావాల్సి ఉండగా.. చిత్ర విడుదలపై కోర్టు స్టే విధించింది. ఈ సినిమా విడుదల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన చిత్రం ‘మా ఇష్టం’(డేంజరస్). హిందీలో ‘ఖత్రా’ అనే టైటిల్‌తో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం ఏప్రిల్ 8న విడుదల కావాల్సి ఉండగా.. చిత్ర విడుదలపై కోర్టు స్టే విధించింది. ఈ సినిమా విడుదల కాకుండా.. టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చినట్లుగా తాజాగా జరిగిన మీడియా సమావేశంలో ప్రకటించారు. ఇంతకు ముందు కొన్ని చిత్రాలకు వర్మతో కలసి నట్టి కుమార్ భాగస్వామ్యం వహించిన విషయం తెలిసిందే. అలాంటి నట్టికుమార్ సడెన్‌గా స్టే తీసుకురావడంతో పాటు తాజాగా వర్మపై కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. 


ఈ సందర్భంగా నట్టికుమార్ మాట్లాడుతూ.. ‘‘వర్మ చేసిన కొన్ని సినిమాలకు నా స్నేహితులతో కలసి నేను కొంత డబ్బును ఫైనాన్స్ చేశాను. అయితే ఎన్నోమార్లు నాకు ఇవ్వాల్సిన డబ్బులు గురించి  వర్మ దగ్గర ప్రస్తావించినా లాభం లేకపోయింది. ఎంతసేపూ తప్పించుకుని తిరుగుతుండటంతో.. డబ్బులను ఎగగొట్టాలన్న ఆలోచనలో తను ఉన్నట్లుగా నాకు అర్ధమైంది. నేను, నా స్నేహితులు కలిసి దాదాపు 5 కోట్ల 29 లక్షల రూపాయల వరకు ఆయనకు ఫైనాన్స్ చేశాము. ఈ డబ్బుల కోసం ఎంతోకాలం ఎదురుచూసి, కొన్ని సంప్రదింపులు జరిపిన తర్వాత ప్రతీ సినిమాకు విడుదలకు ముందు 50 లక్షల రూపాయలు ఇస్తానని డాక్యుమెంట్ రాసి ఇచ్చిన వర్మ, చివరకు దానిపై కూడా నిలబడకుండా, 10 లక్షలు ఇస్తానంటూ, ‘మా ఇష్టం’ సినిమా విడుదలకు ముందు రోజు వరకు ఆ ఊసే ఎత్తకుండా తన సినిమాను విడుదల చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయమై ఫిలిం చాంబర్స్‌కు లెటర్స్ పెట్టినా ఫలితం లేకపోవడంతో.. ఇక లాభం లేదనుకుని కోర్టుకు వెళ్లడం జరిగింది. ఈ మేరకు కోర్టు ‘మా ఇష్టం’ సినిమా విడుదలపై స్టే విధించింది. 


వర్మ తీసిన ‘లఢఖీ’ చిత్రంపై కూడా ఇంతకుముందు స్టే తెచ్చాను. పుట్టిన రోజున వర్మకు ఇది పెద్ద షాకింగ్ న్యూసే. అయితే మాలాగే వర్మ బాధితులు ఎందరో ఉన్నారని, అయితే వాళ్ళు బయటకు రాలేదని, నేను మాత్రమే ధైర్యంగా ఆయన చేస్తున్న మోసాలను బయటపెట్టాలని ఈ విధంగా ముందుకు వచ్చాను. అనేక సినీ యూనియన్ల వారికి కూడా ఆయన బాకీ ఉన్నారని నాకు తెలిసింది. ఎప్పటికప్పుడు కొత్తవాళ్లతో కలసి సినిమాలు చేసి, వారిని ఆర్ధికంగా మోసగించడం వర్మ పనిగా పెట్టుకున్నారు. హైదరాబాద్ వదిలి ముంబై, ఆ తర్వాత ముంబై వదిలి తిరిగి హైదరాబాద్, గోవా ఇలా తిరుగుతూ వాళ్ళను మోసగిస్తున్నాడు. దీనిపై వర్మ ఎక్కడికి చర్చకు రమ్మన్నా.. నేను సిద్ధంగా ఉన్నా. ఒక వైపు కోర్టు ‘మా ఇష్టం’ సినిమా విడుదలపై స్టే విధిస్తే, తాము సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు వర్మ చెప్పుకోవడాన్ని బట్టి ఆయన ఎలాంటి వ్యక్తి ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు..’’ అంటూ చెప్పుకొచ్చారు.

Updated Date - 2022-04-08T03:06:40+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!