సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Nani: అంటే.. సుందర్ రెడీ..

ABN, First Publish Date - 2022-05-24T22:28:48+05:30

నేచురల్ స్టార్ (Natural Star) నాని (Nani) నజ్రియా ఫహద్ (Nazriya Fahadh) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘అంటే సుందరానికి’ (Ante Sundaraniki).

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేచురల్ స్టార్ (Natural Star) నాని (Nani) నజ్రియా ఫహద్ (Nazriya Fahadh) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘అంటే సుందరానికి’ (Ante Sundaraniki). వివేక్ ఆత్రేయ (Vivek Athreya) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీని జూన్ 3వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ మొదలు పెట్టారు. దీనిలో భాగంగా వరుసగా సాంగ్స్‌ను వదులుతున్నారు. 


ఫస్ట్ సింగల్ ‘పంచెకట్టు’, సెకెండ్ సింగల్ ‘ఎంత చిత్రం’ వచ్చి ఆకట్టుకోగా తాజాగా థర్డ్ సింగిల్ ‘రంగో రంగా’ను మేకర్స్ విడుదల చేశారు. వివేక్ సాగర్ (Vivek Sagar) సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటి వరకూ వచ్చిన ఈ మూడు పాటలు బాగానే ఆకట్టుకుంటున్నాయి. కాగా, ఇప్పుడు నాని ప్రమోషన్స్ కోసం రెడీ అవుతున్నాడు. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాతలు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇప్పటి వరకు నాని చేసిన సినిమాలన్నిటిలోనూ ‘అంటే సుందరానికి’ కంప్లీట్ డిఫరెంట్ కథాంశంతో రాబోతోంది.  


రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ‘అంటే సుందరానికి’ నానికి ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూడాలి. ఇక ఈ సినిమాను తమిళ వెర్షన్‌లో ‘అడాడే సుందరా’ (Adade Sundara), మలయాళ వెర్షన్‌లో ‘ఆహా సుందరా’ (Aha Sundara) అనే టైటిల్‌తో విడుదలచేయనున్నారు. గత ఏడాది డ్యూయల్ రోల్‌లో నటించిన శ్యామ్ సింగరాయ్ మంచి హిట్ సాధించింది. కాగా, నాని ‘దసరా’ అనే సినిమాలో ప్రస్తుతం నటిస్తున్నాడు. కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీని పాన్ ఇండియా లెవల్‌లో రూపొందిస్తుడగా కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్నాడు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. 



Updated Date - 2022-05-24T22:28:48+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!