Nani: ‘రేపటి సంది దుమ్ము లేసిపోద్ది’
ABN , First Publish Date - 2022-10-03T00:43:42+05:30 IST
‘రేపటి సంది దుమ్ము లేసిపోద్ది’ అంటున్నారు నేచురల్ స్టార్ నాని. ఆయన హీరోగా నటిస్తున్న ‘దసరా’ చిత్రం నుంచి ఆయనే ఓ వీడియో లీక్ చేశారు. అందుకు కారణం కూడా చెప్పారు.
                            
‘రేపటి సంది దుమ్ము లేసిపోద్ది’ అంటున్నారు నేచురల్ స్టార్ నాని(Nani). ఆయన హీరోగా నటిస్తున్న ‘దసరా’(Dasara movie) చిత్రం నుంచి ఆయనే ఓ వీడియో లీక్ చేశారు. అందుకు కారణం కూడా చెప్పారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth odela) ప్రోమో కట్ లేదు అనడంతో స్వయంగా నాని తన ఫోన్లో ఓ మాస్ సాంగ్‌ను షూట్ చేసి ట్విట్టర్లో వదిలారు. ఊరమాస్ స్టెప్పులు వేస్తూ దుమ్ము లేస్తున్న వీడియోను నాని పోస్ట్ చేశారు.
‘పాట చిత్రీకరిస్తున్నపుడు నా ఫోన్లో రికార్డు చేసిన ఒక విజువల్‌ను లీక్ చేస్తున్నా(Nani leaked song). ‘రేపటి సంది దుమ్ము లేసిపోద్ది’ అని నాని క్యాప్షన్ ఇచ్చారు. తెలంగాణలోని రామగుండం నేపథ్యంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. సోమవారం ఈ చిత్రంలోని మాస్ సాంగ్‌ను విడుదల చేయనున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణ సంగీతం అందిస్తున్నారు.