Mokshagna: నందమూరి వారసుడు ఇప్పుడెట్టున్నాడో చూశారా?
ABN, First Publish Date - 2022-09-07T01:51:45+05:30
నందమూరి అభిమానులు చాలా రోజులుగా నందమూరి నటసింహ బాలకృష్ణ (Balakrishna) బిడ్డ మోక్షజ్ఞ ఎంట్రీ కోసం వేచి చూస్తున్నారు. అదిగో, ఇదిగో అనే మాటలే కానీ.. ఆయన సినీ ఎంట్రీ ఎప్పుడనేది
నందమూరి అభిమానులు చాలా రోజులుగా నందమూరి నటసింహ బాలకృష్ణ (Balakrishna) బిడ్డ మోక్షజ్ఞ ఎంట్రీ కోసం వేచి చూస్తున్నారు. అదిగో, ఇదిగో అనే మాటలే కానీ.. ఆయన సినీ ఎంట్రీ ఎప్పుడనేది మాత్రం క్లారిటీ రావడం లేదు. సెప్టెంబర్ 6న నందమూరి మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) పుట్టినరోజు. ఈ పుట్టినరోజుకైనా ఆయన వెండితెర అరంగేట్రానికి సంబంధించిన వార్త వస్తుందని నందమూరి అభిమానులు ఎంతగానో వేచి చూశారు.. ఆశపడ్డారు. కానీ బాలయ్య బాబు సైడ్ నుంచి ఎటువంటి ప్రకటనా రాలేదు. ఆ మధ్య.. నందమూరి వారసుడి ఎంట్రీ గురించి బాలయ్య మాట్లాడుతూ.. కథలు సిద్ధం చేయిస్తున్నాం.. మంచి కథతో ఎంట్రీ ఉంటుందనేలా చెప్పుకొచ్చారు. ఆయన ఇది చెప్పి కూడా చాలా కాలం అవుతుంది. సినీ ఎంట్రీ సంగతి తర్వాత.. కనీసం వారసుడు ఎట్టున్నాడో కూడా తెలియనివ్వకుండా మోక్షజ్ఞను బాలయ్య ప్రిపేర్ చేయిస్తున్నారు. మీడియా ముందుకు కూడా రానీయడం లేదు. దీంతో.. నందమూరి నూతన వారసుడు ఇప్పుడు ఎట్టున్నాడా? అని ఒకటే ఎదురు చూపులు. అలా ఎదురు చూసే వారి కోసం.. తాజాగా తన కుమారుడి కటౌట్‌ని బాలయ్య రివీల్ చేశారు.
ఆయన హీరోగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోన్న ‘NBK107’ సెట్స్‌లో నందమూరి మోక్షజ్ఞ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. మోక్షజ్ఞతో సెట్‌లో బర్త్‌డే కేక్‌ని కూడా కట్ చేయించారు. ప్రస్తుతం ఈ సినిమా టర్కీలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ పుట్టినరోజు వేడుకలో బాలయ్య సతీమణి వసుంధర (Vasundhara) కూడా పాల్గొన్నారు. ‘NBK107’ టీమ్ నుండి శృతిహాసన్ (Shruti Haasan), దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni), సప్తగిరి, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ ఎర్నేని వంటి వారు పాల్గొన్నారు. ఇక తాజాగా విడుదలైన పిక్‌లో మోక్షజ్ఞను చూసిన నందమూరి అభిమానులు.. మా నందమూరి సింహం సిద్ధమవుతోందంటూ.. సోషల్ మీడియా వేదికగా ఈ పిక్‌ని వైరల్ చేస్తూ.. సంబరాలు చేసుకుంటున్నారు.