సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Bimbisara: జగత్‌ జజ్జరిక.. ఓటీటీలోకి వచ్చేస్తున్నాడహో.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

ABN, First Publish Date - 2022-10-15T00:53:09+05:30

నందమూరి కల్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) హీరోగా నటించిన సినిమా ‘బింబిసార’ (Bimbisara). సోషియో ఫాంటసీ కథతో రూపొందింది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 5న విడుదల అయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందమూరి కల్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) హీరోగా నటించిన సినిమా ‘బింబిసార’ (Bimbisara). సోషియో ఫాంటసీ కథతో రూపొందింది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 5న విడుదల అయింది. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాను థియేటర్‌లో మిస్ అయిన వారంతా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ప్రేక్షకుల ఎదురు చూపులకు తెర దించుతూ డిజిటల్ ప్లాట్‌ఫాం స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించింది. 


‘బింబిసార’ లో కల్యాణ్ రామ్ డ్యూయల్ రోల్‌లో నటించాడు. బింబిసారుడు, దేవదత్తుడు అనే పాత్రల్లో కనిపించాడు. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను ‘జీ-5’ భారీ ధర చెల్లించి సొంతం చేసుకుంది. ఈ సినిమా అక్టోబర్ 21నుంచి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ‘జీ-5’ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ‘‘జగత్‌ జజ్జరిక.. బింబి వచ్చేస్తున్నాడహో. అతడిని అక్టోబర్ 21న కలుసుకోండి’’ అని ‘జీ-5’ సోషల్ మీడియా వేదికగా మెసేజ్‌ను అభిమానులతో పంచుకుంది. థియేటర్స్‌కి ప్రేక్షకులను రప్పించడం పెను సవాలుగా మారిన రోజుల్లో కల్యాణ్ రామ్ ‘బింబిసార’ ని విడుదల చేశాడు. ఈ సినిమాకు వశిష్ట దర్శకత్వం వహించాడు. తొలి చిత్రమే అయినప్పటికి అతడు తెరకెక్కించిన విధానం విమర్శకులతో పాటు ప్రేక్షకులను మెప్పించింది. బింబిసార కథ విషయానికి వస్తే.. క్రీస్తు పూర్వం 500 సంవత్సరంలో త్రిగర్తల సామ్రాజ్యానికి అధినేత బింబిసారుడు (కల్యాణ్ రామ్). అతి క్రూరుడైన బింబిసారుడు.. తన రాజ్యంలోని ప్రజలను అధికారం, అహంకారం, బలగర్వంతో బాధిస్తూ ఉంటాడు. కత్తి పడినా, కన్నుపడినా అతడికి దాసోహమవ్వాల్సిందే. అలాంటి క్రూరుడైన బింబిసారుడుని.. తన కవల సోదరుడు దేవదత్తుడు (కల్యాణ్ రామ్) ఎదిరిస్తాడు. దీంతో బింబిసారుడు తన సోదరుడిని చంపేందుకు ప్రయత్నిస్తాడు. అప్పుడే బింబిసారుడిని దేవదత్తుడు ఓ మాయాదర్పణంపై విసిరేస్తాడు. ఆ మాయాదర్పణ మహత్యంతో బింబిసారుడు వర్తమాన కాలంలోకి వచ్చి పడతాడు. వర్తమాన కాలంలోకి వచ్చిన బింబిసారుడు‌కి ఎదురైన అనుభవాలు ఏంటి? మాయాదర్పణం ద్వారా విసిరివేయబడ్డ బింబిసారుడు మళ్లీ త్రిగర్తల సామ్రాజ్యానికి వెళ్లవలసిన అవసరం ఎందుకొచ్చింది? త్రిగర్తల సామ్రాజ్యం చివరికి ఏమైంది? అనేది తెలియాలంటే  ఈ సినిమాను చూడాల్సిందే. 




Updated Date - 2022-10-15T00:53:09+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!