నందమూరి బాలకృష్ణకు కోవిడ్ పాజిటివ్
ABN , First Publish Date - 2022-06-25T00:03:15+05:30 IST
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తాజాగా చేసిన కోవిడ్ పరీక్షల్లో బాలకృష్ణకు పాజిటివ్ నిర్ధారణ కావటంతో.. ఆయన ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో చికిత్స..

Balakrishna: టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తాజాగా చేసిన కోవిడ్ పరీక్షల్లో బాలకృష్ణకు పాజిటివ్ నిర్ధారణ కావటంతో.. ఆయన ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ‘‘తనకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు. పూర్తిగా ఆరోగ్యంతో ఉన్నా. గత రెండు రోజులుగా తనని కలిసిన వారు కూడా కోవిడ్ టెస్టు చేయించుకోవాలి. అందరూ కోవిడ్ నియంత్రణ చర్యలు పాటించాలి’’ అని తాజాగా బాలకృష్ణ తెలియజేశారు. ఈ విషయం తెలిసిన ఆయన అభిమానులు.. ‘బాలయ్య త్వరగా కోలుకోవాలంటూ’ ప్రార్థనలు చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఓ పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్ర తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.