NBK108: అన్న దిగిండు! గిప్పడి సంది లెక్కలు టక్కర్..

ABN , First Publish Date - 2022-12-08T21:48:36+05:30 IST

గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi)ల క్రేజీ కాంబినేషన్‌లో #NBK108 చిత్రం తెరకెక్కనున్న విషయం

NBK108: అన్న దిగిండు! గిప్పడి సంది లెక్కలు టక్కర్..

గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi)ల క్రేజీ కాంబినేషన్‌లో #NBK108 చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి (Sahu Garapati), హరీష్ పెద్ది (Harish Peddi) ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ చిత్రం.. గురువారం పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమైంది. ముహూర్తపు షాట్‌కు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ (Allu Aravind) క్లాప్‌ కొట్టగా.. నిర్మాత దిల్ రాజు (Dil Raju) కెమెరా స్విచ్ఛాన్ చేశారు. తొలి సన్నివేశానికి లెజెండరీ డైరెక్టర్ కె రాఘవేంద్రరావు ( K Raghavendra Rao) గౌరవ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని, కిలారు సతీష్, నిర్మాత శిరీష్ స్క్రిప్ట్‌ను మేకర్స్‌కి అందజేశారు. పూజా కార్యక్రమాల అనంతరం.. రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభించారు. ఈ షూటింగ్ ప్రారంభోత్సవం సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి ట్విట్టర్ వేదికగా.. ‘అన్న దిగిండు! గిప్పడి సంది లెక్కలు టక్కర్.. ’ అంటూ చేసిన ట్వీట్.. వైరల్ అవుతోంది.


ఇక పూజా కార్యక్రమాల అనంతరం NBK108 చిత్రం యాక్షన్ బ్లాక్‌తో ప్రారంభించారు. వి వెంకట్ మాస్టర్ నేతృత్వంలో ఈ యాక్షన్ బ్లాక్‌‌ని మొదలెట్టారు. ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ ఆధ్వర్యంలో ఫైట్ సీక్వెన్స్ కోసం భారీ సెట్ నిర్మించారు. ఇంతకుముందెన్నడూ కనిపించని పాత్రలో బాలయ్య ఇందులో కనిపించనున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ మార్క్ మాస్ అండ్ యాక్షన్, అనిల్ రావిపూడి మార్క్ ఎలిమెంట్స్ వుండబోతున్నాయి. బాలకృష్ణ స్టార్‌డమ్‌ని దృష్టిలో పెట్టుకుని అనిల్ రావిపూడి ఓ పవర్‌ఫుల్ కథను రాశారు. మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల కీలక పాత్ర పోషిస్తున్న  ఈ చిత్రానికి మరోసారి మ్యూజికల్ సెన్సేషన్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. మరో వైపు బాలయ్య, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ‘వీరసింహారెడ్డి’ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని.. 2023 సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. (Nandamuri Balakrishna and Anil Ravipudi NBK108 Film Launched)









Updated Date - 2022-12-08T21:48:36+05:30 IST

Read more