నాగశౌర్య సినిమా షురూ!

ABN , First Publish Date - 2022-08-23T05:44:50+05:30 IST

యువ కథానాయకుడు నాగశౌర్య మంచి దూకుడుమీద ఉన్నారు. వరుసగా సినిమాలు చేసేస్తున్నారు. ఆయన నటించిన ‘కృష్ణ వ్రింద విహారి’ త్వరలోనే విడుదల...

నాగశౌర్య సినిమా షురూ!

యువ కథానాయకుడు నాగశౌర్య మంచి దూకుడుమీద ఉన్నారు. వరుసగా సినిమాలు చేసేస్తున్నారు. ఆయన నటించిన ‘కృష్ణ వ్రింద విహారి’ త్వరలోనే విడుదల కాబోతోంది. మరోవైపు ‘ఫలానా అబ్బాయి - ఫలానా అమ్మాయి’ చిత్రీకరణ దశలో ఉంది. ఈలోగా మరో సినిమానీ పట్టాలెక్కించేశారు. నాగశౌర్య కథానాయకుడిగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. పవన్‌ బాసంశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. చెరుకూరి సుధాకర్‌ నిర్మాత. సోమవారం ఉదదయం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు క్లాప్‌నిచ్చారు. శ్రీకాంత్‌ ఓదెల స్విచ్చాన్‌ చేశారు. నాగశౌర్య సరసన యుక్తి తరేజాని కథానాయికగా ఎంచుకొన్నారు. ‘‘ఇదో వైవిధ్యభరితమైన ప్రేమకథ. వినోదానికి పెద్ద పీట వేశాం. కుటుంబం అంతా చూసేలా తీర్చిదిద్దుతున్నాం. త్వరలోనే టైటిల్‌ని ప్రకటిస్తామ’’ని చిత్ర బృందం తెలిపింది. ఏ.ఆర్‌.రెహమాన్‌ శిష్యుడు పవన్‌ సీహెచ్‌ సంగీతం అందిస్తున్నారు. ఛాయాగ్రహణం: వంశీ పచ్చిపులుసు, కళ: ఏఎ్‌స.ప్రకాశ్‌, కూర్పు: కార్తీక్‌ శ్రీనివాస్‌.


Updated Date - 2022-08-23T05:44:50+05:30 IST

Read more