సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Nagarjuna Akkineni : అప్పుడు సైకిల్ చెయిన్.. ఇప్పుడు తమహగనే

ABN, First Publish Date - 2022-08-15T17:34:25+05:30

అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) తాజా చిత్రం ‘ది ఘోస్ట్’ (The Ghost). ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) దర్శకత్వంలో, శ్రీవెంకటేశ్వరా సినిమాస్ యలెల్పీ, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) తాజా చిత్రం ‘ది ఘోస్ట్’ (The Ghost). ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) దర్శకత్వంలో, శ్రీవెంకటేశ్వరా సినిమాస్ యలెల్పీ, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సోనాల్ చౌహాన్ (Sonal Chauhan) కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి భరత్ సౌరభ్ (Bharath Saurabh) సంగీతం అందిస్తున్నారు. ఇందులో నాయికానాయకులిద్దరూ ‘రా’ ఏజెంట్స్ గా నటిస్తుండడం విశేషం. ముఖ్యంగా నాగ్ తన సీక్రెట్ మెషీన్‌కు అడ్డుపడే ప్రత్యర్ధుల్ని ఏరిపారేసే కిల్లింగ్ మెషీన్‌ పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యే పూర్తయింది.  ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 5న థియేటర్స్ లోకి రాబోతోంది చిత్రం. ఈ తేదీని నాగార్జున అభిమానులు అసలు మరిచిపోలేరు. ఎందుకంటే.. అదే తేదీన 1989లో టాలీవుడ్ దశను, దిశను మార్చిన ‘శివ’ (Shiva) చిత్రం విడుదలైంది.


రామ్‌గోపాల్ వర్మ (Ramgopal Varma) టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అవుతూ, ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఒక సంచలనం. సైకిల్ చెయిన్‌తో భవానీ మనుషులపై నాగ్ చేసిన శివతాండవం అప్పట్లో తెగ ట్రెండ్ అయింది. అంతవరకూ హీరోల చేతుల్లో కత్తులు, చాకులు, పిడిబాకులు, తుపాకులు చూసిన ప్రేక్షకులు నాగ్ చేతిలోని సైకిల్ చెయిన్‌కు అవాక్కయిపోయారు. ఇప్పుడు అదే డేట్లో రాబోతున్న ‘ది ఘోస్ట్’ మూవీతో కూడా నాగార్జున ఒక సరికొత్త ఆయుధాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు. దాని పేరు ‘తమహగనే’ (Tamahagane). జపనీష్ ట్రెడిషన్ లో ఇదొక రకం మెటల్.  తమ అంటే ఖరీదైన, హగనే అంటే ఉక్కు అని అర్ధాలున్నాయి. ఎంతో ఖరీదైన ఆ స్టీల్‌తో కత్తులు, ఖడ్గాల్లాంటి ఆయుధాలు తయారు చేస్తారు. అలాంటి ఆయుధాన్ని నాగ్ ఈ సినిమాలో వాడుతున్నారు. 


ఈ నెల 18 ఉదయం 10 : 08 నిమిషాలకు ‘ది ఘోస్ట్’ చిత్రం టీజర్‌ను వదులుతున్నారు మేకర్స్. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.. బ్రేస్ యువర్ సెల్ఫ్ .. తమహగనే రెడీ టు స్ట్రైక్ అని మెన్షన్ చేస్తూ నాగ్ ఖడ్గాన్ని పట్టుకొన్న ప్రత్యేక పోస్టర్ విడుదల చేశారు. ఇందులో నాగార్జున తమహగనే తిప్పుతూ.. ప్రత్యర్ధుల్ని గడగడలాడిస్తారు అని అర్ధమవుతోంది. మరి శివ లాగానే ‘ది ఘోస్ట్’ చిత్రం కూడా సెన్సేషనల్ హిట్ అవుతుందేమో చూడాలి. 



Updated Date - 2022-08-15T17:34:25+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!