Nbk unstoppable 2: నాగబాబు - బెల్లంకొండ సురేష్ వస్తే..

ABN , First Publish Date - 2022-09-25T21:28:29+05:30 IST

బాలయ్య 'అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 2' (Nbk unstoppable) త్వ‌ర‌లో మొదలు కానుంది. మ‌రోసారి బాల‌య్య‌తో 'ఆహా`అనిపించే కంటెంట్ తో ఈ సీజన్ 2 ని ముస్తాబు చేశాం అని చెబుతున్నారు ఆహా టీమ్.

Nbk unstoppable 2: నాగబాబు - బెల్లంకొండ సురేష్  వస్తే..

బాలయ్య 'అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 2' (Nbk unstoppable) త్వ‌ర‌లో మొదలు కానుంది. మ‌రోసారి బాల‌య్య‌తో 'ఆహా`అనిపించే కంటెంట్ తో  ఈ సీజన్ 2 ని ముస్తాబు చేశాం అని చెబుతున్నారు ఆహా టీమ్. మరోవైపు  హోస్ట్ గా బాలయ్య  (Bala krishna)సూపర్ సక్సెస్.  ఫీల్డ్  ఏదైనా తాను అడుగుపెడితే  అక్కడ రికార్డులు గల్లంతే అని బాలయ్య మళ్లీ నిరూపించాడు. అయితే, సీజన్ 2 మొదటి ఎపిసోడ్ గెస్ట్ ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్. 'పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్' మొదటి ఎపిసోడ్ గెస్ట్ లు అని, లేదు.. అనుష్క అంటూ ఇప్పటికే కొంతమంది పేర్లు బయటకు వచ్చాయి. 


అసలు 'సీజన్ 2' మొదటి ఎపిసోడ్ కి  నాగబాబు గెస్ట్ గా వస్తే ఎలా ఉంటుంది ?,  నిజమే,  నిజంగా నాగబాబు వస్తే ఆ కిక్కే వేరు. ‘‘బాలయ్య ఎవరో నాకు తెలియదు" అనే డైలాగ్ తో  మొదలెట్టిన నాగబాబు.  చాలా సార్లు గతంలో  బాలయ్య పై మండిపడ్డాడు.  పైగా బాలకృష్ణను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వరుస వీడియోల సిరీస్ కూడా చేశాడు.  దీనికితోడు గతంలో బాలయ్య  'సారే జహాసె అచ్ఛా ' అంటూ పాడ బోయి తడబడిన సంగతి కూడా  తెలిసిందే. దీనికి సెటైర్ గా  తన ఫేస్ బుక్ పేజీలో ఒక చిన్న పిల్లాడు 'సారే జహాసె అచ్ఛా' గేయాన్ని అద్భుతంగా పాడిన వీడియోను నాగబాబు (Nagababu)పోస్ట్ చేసి బాలయ్యని చిన్న చూపు చూశాడు.  


ఆ తర్వాత  బాలయ్య పాడిన  'శివశంకరి' పాట పై అయితే  నాగబాబు  ఓ రేంజ్ లో ట్రోలింగ్ కి దిగాడు. "కరోనా జబ్బు కన్నా ప్రమాదకరమైన సంగీతం అంటూ.. చిన్న పిల్లలు, హెల్త్  బాగా లేని వాళ్లు   ఆ సంగీతం విన్నారంటే ఏదైన జరగొచ్చు' అంటూ బాలయ్య పై  మెగా బ్రదర్  వెటకారంగా పోస్ట్ లు పెట్టాడు. మొత్తానికి నాగబాబు  దెబ్బకు నందమూరి వీరాభిమానులంతా  ఆ సమయంలో  బీభత్సంగా బాధ పడ్డారు.  అయితే, అది గతం.. గతం గతః.  కాబట్టి.. ప్రస్తుతం 'అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 2'కి రికార్డు స్థాయి క్లిక్స్ అండ్ వ్యూస్ రావాలంటే.. ఏ పవన్ కళ్యాణో, లేక  నాగబాబో.. ఇదీ కుదరకపోతే ఏ బెల్లంకొండ సురేషో గెస్ట్ గా రావాలి.  నిర్మాత బెల్లంకొండ సురేష్ కి - హీరో బాలకృష్ణ కి మధ్య ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఆ సంఘటన ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. డైరెక్ట్ గా కాకపోయినా.. దాని పై ఇన్ డైరెక్ట్ గానైనా అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 2 ఎపిసోడ్ లో  ఈ ఇద్దరు క్లారిటీ ఇచ్చి, ఆ మిస్టరీకి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు.  మరి,  బెల్లంకొండ గెస్ట్ వస్తే  బాలయ్య అంగీకరిస్తాడా ?


అయినా,  జరిగిపోయిన చేదు సంఘటనను  తలచుకుని బాధపడే బదులు,  అసలు ఆ చేదు జ్ఞాపకం  గుర్తుకు రాకుండా శాశ్వతంగా తుడిచి వేసుకోవడం ఉత్తమం కదా ? ఎలాగూ గతాన్ని మార్చలేం. కనీసం ఆ గతం తాలూకు మరకలను అయినా నీట్ గా  వాష్ చేసుకోవచ్చు కదా.  అన్నిటికీ మించి.. 'బాలయ్య - బెల్లంకొండ' ఎపిసోడ్, అలాగే  'బాలయ్య - నాగబాబు' ఎపిసోడ్  ప్రేక్షకులకు ఫుల్ కిక్ ను ఇస్తాయి.  'ఆహా' టీమ్  ఆ కిక్ ను పంచడానికి శక్తి వంచన లేకుండా కృషి చేసే ప్రయత్నం చేస్తే.. బాలయ్య 'అన్‌స్టాప‌బుల్' అభిమానులకు అద్భుతంగా కాలక్షేపం అవుతుంది.

Updated Date - 2022-09-25T21:28:29+05:30 IST