సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Naga Shaurya: దర్శకేంద్రుడి క్లాప్‌తో హీరో నాగశౌర్య చిత్రం ప్రారంభం

ABN, First Publish Date - 2022-08-23T01:39:30+05:30

యంగ్ హీరో నాగశౌర్య (Naga Shaurya) హీరోగా.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి (Sri Lakshmi Venkateswara Cinemas LLP) బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం. 6గా రూపుదిద్దుకోనున్న చిత్రాన్ని సోమవారం హైదరాబాద్‌లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యంగ్ హీరో నాగశౌర్య (Naga Shaurya) హీరోగా.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి (Sri Lakshmi Venkateswara Cinemas LLP) బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం. 6గా రూపుదిద్దుకోనున్న చిత్రాన్ని సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. పవన్ బాసంశెట్టి (Pawan Basamsetti) దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) నిర్మాత. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముహూర్తపు షాట్‌కు లెజెండరీ డైరెక్టర్ దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు (K Raghavendra Rao) క్లాప్‌బోర్డ్‌ కొట్టి.. స్క్రిప్ట్‌ను అందజేశారు. నాని ‘దసరా’ (Nani’s Dasara) దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కెమెరా స్విచాన్ చేశారు. 


నాగశౌర్య సరసన యుక్తి తరేజా (Yukti Thareja) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి.. ఇటీవల చైతూ-సాయిపల్లవి కాంబినేషన్‌లో వచ్చిన ‘లవ్ స్టోరి’ (Love Story) చిత్రానికి సంగీతం అందించిన ఏఆర్ రెహమాన్ శిష్యుడు పవన్ సిహెచ్ (Pawan CH) సంగీతం అందించనున్నారు. ఇంకా పేరు ఖరారు చేయని ఈ చిత్రం యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌లో నాగశౌర్యకు ఉన్న క్రేజ్‌కి తగినట్లుగా ఫన్-ఫిల్డ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని.. నూతన దర్శకుడి యూనిక్ స్ర్కిప్ట్, ట్రీట్మెంట్‌తో ఈ చిత్రం చాలా ప్రత్యేకంగా ఉండబోతోందని ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వెల్లడించారు. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. 



Updated Date - 2022-08-23T01:39:30+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!