సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Naga Chaithanya ‘థాంక్యూ’ మూవీ ప్రమోషన్స్ మొదలు..

ABN, First Publish Date - 2022-06-24T14:42:57+05:30

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య (Naga Chaithanya) ఇటీవలే లవ్ స్టోరీ (Love Story) మూవీతో వచ్చి డీసెంట్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత నాగ చైతన్య తన తండ్రి అక్కినేని నాగార్జున (Nagarjuna)తో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య (Naga Chaithanya) ఇటీవలే లవ్ స్టోరీ (Love Story) మూవీతో వచ్చి డీసెంట్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత నాగ చైతన్య తన తండ్రి అక్కినేని నాగార్జున (Nagarjuna)తో కలిసి చేసిన మల్టీస్టారర్ ‘బంగార్రాజు’ (Bangarraju) సినిమాతోనూ మంచి హిట్ అందుకున్నాడు. ఇలా ‘మజిలీ’, ‘లవ్ స్టోరీ’, ‘బంగార్రాజు’ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న చైతూ, అదే ఊపుతో ‘థాంక్యూ’ (Thankyou) సినిమాను చేశాడు. గతంలో అక్కినేని ఫ్యామిలీ హీరోలందరితో కలిపి ‘మనం’ వంటి క్లాసిక్‌ను తీసిన  విక్రమ్ కె కుమార్ (Vikram K Kumar) దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.


ఈ సినిమాలో బబ్లీ బ్యూటీ రాశి ఖన్నా (Rashi Khanna) చైతు సరసన హీరోయిన్‌గా నటించింది. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ సాంగ్స్, టీజర్‌లకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. అంతేకాదు, సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి. ఇక ‘థాంక్యూ’ జులై 8న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌ని నాగ చైతన్య, రాశి ఖన్నా మొదలుపెట్టారు. 


ప్రస్తుతం వీరి నుండి పలు మీడియా ఛానెల్స్ వారు ఇంటర్వ్యూస్ షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆకట్టుకునే కథ, కథనాలతో అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించేలా దర్శకడు విక్రమ్ కె కుమార్ రూపొందిస్తున్న ఈ మూవీలో హీరో చైతు పాత్ర ఎంతో అద్భుతంగా ఉంటుందని, ముఖ్యంగా సినిమాకి థమన్ అందించిన సాంగ్స్, బీజీఎమ్ అందరినీ ఎంతగానో అలరిస్తాయని చిత్రబృందం చెబుతుంది. కాగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు (Dil Raju) నిర్మించారు. ఇక చైతు, తాజాగా నటిస్తున్న సినిమా కూడా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళంలో విడుదల కానుంది. రెండవసారి కృతి శెట్టి (Krthi Setti) చైతు సరసన హీరోయిన్‌గా నటిస్తోంది.  

Updated Date - 2022-06-24T14:42:57+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!