సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Naga Chaitanya: ‘థ్యాంక్యూ’ వాయిదా.. విడుదల ఎప్పుడంటే?

ABN, First Publish Date - 2022-06-25T01:05:41+05:30

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా.. ‘మనం’ (Manam) వంటి బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రంతో దర్శకుడిగా తన సత్తా చాటిన విక్రమ్ కె కుమార్ (Vikram K Kumar) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘థ్యాంక్యూ’ (Thank You). శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా.. ‘మనం’ (Manam) వంటి బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రంతో దర్శకుడిగా తన సత్తా చాటిన విక్రమ్ కె కుమార్ (Vikram K Kumar) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘థ్యాంక్యూ’ (Thank You). శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) పతాకంపై సక్సెస్ ఫుల్ నిర్మాతలు దిల్ రాజు (Dil Raju), శిరీష్ (Shirish) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగచైతన్య సరసన రాశీ ఖన్నా (Raashi Khanna), మాళవిక నాయర్ (Malvika Nair), అవికా గోర్ (Avika Gor) హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన పాటలు, టీజర్.. మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా.. సినిమాపై భారీగా అంచనాలను కూడా పెంచేశాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జూలై 8న విడుదల చేస్తున్నట్లుగా ఇప్పటికే మేకర్స్ ప్రకటించి ఉన్నారు. అయితే ఈ చిత్రాన్ని ఆ తేదీకి విడుదల చేయడం లేదంటూ తాజాగా మేకర్స్ మరో విడుదల తేదీని ప్రకటించారు. 


జూలై 22న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీగా థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా తెలుపుతూ.. మేకర్స్ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో.. చిత్రాన్ని రెండు వారాల పాటు వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది. లెజండరీ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ సంచలనం థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. బీవీఎస్ రవి కథను అందించారు. 

Updated Date - 2022-06-25T01:05:41+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!