‘ఆపద్బాంధవుడు’ హిట్ కాలేదని తెలిసి కోపం వచ్చింది: Nag Ashwin
ABN , First Publish Date - 2022-05-17T00:55:55+05:30 IST
జాతీయస్థాయిలో పలు అవార్దులు పొంది.. తెలుగులో గర్వించే సంస్థగా పేరుపొందిన సంస్థ పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ (Poornodaya Movie Creations). ఈ సంస్థ అధినేత ఏడిద నాగేశ్వరరావు (Edida Nageswara Rao). ఇప్పుడాయన మనవరాలు

జాతీయస్థాయిలో పలు అవార్దులు పొంది.. తెలుగులో గర్వించే సంస్థగా పేరుపొందిన సంస్థ పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ (Poornodaya Movie Creations). ఈ సంస్థ అధినేత ఏడిద నాగేశ్వరరావు (Edida Nageswara Rao). ఇప్పుడాయన మనవరాలు శ్రీజ (Srija) నిర్మాతగా మారి.. శ్రీజ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో తొలి చిత్రానికి శ్రీకారం చుట్టారు. శ్రీజ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ (First Day First Show) అని పేరు ఖరారు చేశారు. ఈ చిత్ర లోగోను సోమవారం, హైదరాబాద్ ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగిన కార్యక్రమంలో ‘మహానటి’ (Mahanati) దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఆవిష్కరించారు. ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ చిత్రంతో ‘జాతిరత్నాలు’ (JatiRatnalu) ఫేమ్ అనుదీప్ (Aundeep) శిష్యులు వంశీ (Vamsi), లక్ష్మీనారాయణ (Lakshmi Narayana) దర్శకులుగా పరిచయం అవుతున్నారు.
చిత్ర లోగో విడుదల అనంతరం దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘‘ఏడిద నాగేశ్వరరావుగారి పూర్ణోదయ మూవీ క్రియేషన్స్‌ది చాలా గొప్ప జర్నీ. అలాంటి గ్రేట్ సంస్థ మళ్ళీ మొదలవ్వడం చాలా ఆనందంగా వుంది. ‘శంకరాభరణం (Sankarabharanam), స్వాతిముత్యం (Swathi Muthyam)’.. ఇలా ఎన్నో క్లాసిక్ మూవీలు వారి సంస్థ నుంచి వచ్చాయి. ఆ సినిమాలన్నీ చూశాను. వారి సినిమాల్లో చిరంజీవి (Chiranjeevi)గారు చేసిన ‘ఆపద్బాంధవుడు’ (Aapadbandhavudu) సినిమా నాకు చాలా ఇష్టం. నేను చదువుతున్న రోజుల్లో ఆ సినిమా చూశాను. కానీ ఆ సినిమా ఆడలేదని తెలిసి చాలా కోపం వచ్చింది. ఎందుకు విజయం సాధించలేదో నాకు అర్థం కాలేదు. ఈ జర్నీలో వారి వారసులు నిర్మిస్తున్న సినిమా ప్రమోషన్‌కు హెల్ప్ అవడం సంతోషంగా వుంది. ఇంత పెద్ద సంస్థలో అవకాశం వుంటే తప్పకుండా నేను సినిమా చేస్తాను. ఇప్పుడు శ్రీజ ఎంటర్‌టైన్‌మెంట్‌లో మంచి సినిమాలు రావాలి. అనుదీప్ కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ ఇచ్చాడంటే చాలా ఫన్ వుంటుంది. ‘జాతిరత్నాలు’ హిట్ తర్వాత తన స్వార్థం చూసుకోకుండా తన తోటివారిని ఎంకరేజ్ చేయడం నాకు గర్వంగా వుంది. నూతన దర్శకుడు వంశీ ఎం.బి.బి.ఎస్. చదివాడు. సినిమాపై తపనతో ఈ రంగంలోకి వచ్చాడు. ఇప్పుడు అనుదీప్ వల్ల దర్శకుడు అయ్యాడు. జాతిరత్నాలకు ముందు వంశీ ఒక షార్ట్ ఫిలిం తెచ్చాడు. కానీ అది చాలా లాంగ్ ఫిలింలా అనిపించింది. తను కాలేజీలో పలు స్కిట్లు వేసేవాడు. జాతిరత్నాలకు కరెక్ట్‌గా ఫిట్ అయ్యాడు. తనలో చాలా క్రియేటివిటీ వుంది. ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ పోస్టర్ ఒక్కటే చూశాను. వంశీది చాలా యునిక్ జోన్ అఫ్ కామెడీ. కథ గురించి చిన్న లైన్ చెప్పాడు. దానికే రెండు నిమిషాలు నవ్వుకున్నా. సినిమా ఎలా వుంటుందో అనే ఎక్జయిట్మెంట్ వుంది. జాతిరత్నాలు కంటే పెద్ద హిట్ కావాలి’’ అని అన్నారు.
Read more