సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెంటపడేవాడు... వస్తున్నాడు

ABN, First Publish Date - 2022-08-20T05:30:00+05:30

‘హుషారు’ చిత్రంలో నటించిన తేజ్‌ కూరపాటి, అఖిల జంటగా రూపుదిద్దుకున్న ‘నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మా’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘హుషారు’ చిత్రంలో నటించిన తేజ్‌ కూరపాటి, అఖిల జంటగా రూపుదిద్దుకున్న ‘నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మా’ చిత్రం సెప్టెంబర్‌ 2న విడుదల కానుంది. వెంకట్‌ వందెల దర్శకత్వంలో ముల్లేటి కమలాక్షి, గుబ్బల వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. చిత్ర ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ ముల్లేటి నాగేశ్వరరావు మాట్లాడుతూ ‘మంచి కంటెంట్‌తో వచ్చిన సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు.. అని ఇటీవల వచ్చిన సినిమాలు నిరూపించారు. అలాగే మంచి కాన్సె్‌ప్టతో పల్లెటూరి నేపథ్యంలో సాగే ప్రేమకథతో మా  సినిమా రూపుదిద్దుకొంది. త్వరలో ట్రైలర్‌ విడుదల చేస్తాం. మ్యూజికల్‌ గా కూడా మా సినిమా అలరిస్తుంది’ అన్నారు. రెగ్యులర్‌ కథలకు భిన్నంగా మంచి కాన్సె్‌ప్టతో వస్తున్న తమ చిత్రం ప్రేక్షకులకు కనెక్ట్‌ అవుతుందని దర్శకుడు వెంకట్‌ చెప్పారు.

Updated Date - 2022-08-20T05:30:00+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!