సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘నా వెంట‌ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా’ విడుదల తేదీ ఖరారు

ABN, First Publish Date - 2022-08-18T16:56:56+05:30

రావణాసురుడికి తన భార్య మండోదరిపై ఉన్న ప్రేమ, రాముడికి సీతపై ఉన్న ప్రేమ, దశరథుడిక తన కొడుకు మీద ఉన్న నమ్మకం.. ఎంత పవిత్రమైనవో.. అంతటి నిర్మలమైన, స్వచ్ఛమైన ప్రేమ కథ ఈ సినిమాలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జివిఆర్ ఫిల్మ్ మేక‌ర్స్ (GVR Film makers) స‌మ‌ర్ప‌ణ‌లో రాజ‌ధాని ఆర్ట్ మూవీస్ (Rajadhani Art movies) బ్యాన‌ర్‌పై ‘హుషారు’ ఫేమ్ తేజ్ కూర‌పాటి (Tej kurapati), అఖిల ఆక‌ర్ష‌ణ (Akhila Akarshana) జంట‌గా వెంక‌ట్ వందెల ద‌ర్శ‌క‌త్వంలో.. ముల్లేటి నాగేశ్వ‌రావు నిర్మాణ సార‌ధ్యంలో ముల్లేటి క‌మ‌లాక్షి, గుబ్బ‌ల వేంక‌టేశ్వ‌రావు సంయుక్తంగా నిర్మించిన చిత్రం “నా వెంట‌ ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా” (Na venta paduthunna chinnadevadamma). ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీది మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా మేకర్స్ చిత్ర విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి.. సెప్టెంబర్ 2న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా మేకర్స్ తెలిపారు.


ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌ ముల్లేటి నాగేశ్వ‌రావు మాట్లాడుతూ.. ‘‘చాలా రోజుల తర్వాత మళ్లీ ఇండస్ట్రీ కళకళలాడుతోంది. అలాగే మంచి కంటెంట్‌తో వచ్చిన సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని.. ఇటీవల విడుదలైన సినిమాలు నిరూపిస్తున్నాయి. మంచి కాన్సెప్ట్‌తో ప‌ల్లెటూరి నేప‌ధ్యంలో సాగే చ‌క్క‌టి ప్రేమ‌క‌థా చిత్రమిది. సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రావాలనుకున్న మేము డిస్ట్రిబ్యూటర్స్‌తో మాట్లాడాము.. థియేటర్స్ కూడా కన్వినెంట్‌గా ఉన్నాయి. త్వరలోనే చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయనున్నాం’’ అని తెలుపగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘ఇప్పటి వరకు సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో నటించిన పెద్దలు తనికెళ్ళ భరణిగారు, జీవాగారితో పాటు నటించిన నటీనటులు, టెక్నిషియన్స్ అందరూ ఫుల్ సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది. సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా చిత్రాన్ని పెద్ద హిట్ చేయాలని ప్రేక్షకులను కోరుతున్నాం..’’ అని అన్నారు. (Na venta paduthunna chinnadevadamma Release Date)


చిత్ర దర్శకుడు వెంక‌ట్ వందెల మాట్లాడుతూ.. ‘‘మంచి కాన్సెప్ట్‌తో, రెగ్యులర్ స్టోరీకి భిన్నంగా వస్తున్న మా సినిమా అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. రావణాసురుడికి తన భార్య మండోదరిపై ఉన్న ప్రేమ, రాముడికి సీతపై ఉన్న ప్రేమ, దశరథుడిక తన కొడుకు మీద ఉన్న నమ్మకం.. ఎంత పవిత్రమైనవో.. అంతటి నిర్మలమైన, స్వచ్ఛమైన ప్రేమ కథ ఈ సినిమాలో ఉంటుంది. నాకు ఇలాంటి మంచి కథకు దర్శకత్వం చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు. సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను’’ అన్నారు.

Updated Date - 2022-08-18T16:56:56+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!