సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘ముసలోడికి దసరా పండగ’: ఆ దర్శకుడికి అంకితమిస్తున్నారు

ABN, First Publish Date - 2022-05-26T00:25:48+05:30

రాజీనాయుడు, సీతమ్మవాళ్లె ఆశీస్సులతో.. రమణ ఫిలిమ్స్ (Ramana Films) పతాకంపై రమణవాళ్లె నిర్మించిన ద్విభాషా చిత్రం ‘ముసలోడికి దసరా పండుగ’ (Musalodiki Dasara Pandaga). సీనియర్ నటుడు నాజర్ (Nasser) ప్రధాన పాత్రలో నటించగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజీనాయుడు, సీతమ్మవాళ్లె ఆశీస్సులతో.. రమణ ఫిలిమ్స్ (Ramana Films) పతాకంపై రమణవాళ్లె నిర్మించిన ద్విభాషా చిత్రం ‘ముసలోడికి దసరా పండుగ’ (Musalodiki Dasara Pandaga). సీనియర్ నటుడు  నాజర్ (Nasser) ప్రధాన పాత్రలో నటించగా.. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (Seethamma Vakitlo Sirimalle Chettu)  ఫేమ్ అంజలి (Anjali), ‘నువ్వు నేను’ (Nuvvu Nenu) ఫేమ్ అనిత (Anitha) హీరోయిన్లుగా నటించారు. కోవై సరళ, శరణ్య, సత్య ఇతర ముఖ్య పాత్రలలో నటించిన ఈ చిత్రానికి డి. మనోహర్ (D Manohar) దర్శకుడు. తాజాగా ఈ చిత్ర పోస్టర్,  ట్రైలర్‪ను చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన నాజర్ విడుదల చేశారు. 


ఈ సందర్భంగా నాజర్ మాట్లాడుతూ.. ‘‘ఇందులో నా పాత్ర చాలా కొత్తగా  ఉంటుంది. ఇప్పటి వరకు నన్ను అలా చూసి ఉండరు. చిత్ర ట్రైలర్ బావుంది. సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ.. ‘‘ప్రేక్షకులు రెండు గంటలసేపు అన్నీ మర్చిపోయి హాయిగా నవ్వుకునేలా ఈ సినిమా ఉంటుంది. ఆడియో ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. త్వరలో సినిమా రిలీజ్‪కు సంబంధించి గ్రాండ్‪గా  ప్లాన్ చేస్తున్నాం. ఈ చిత్రాన్ని స్వర్గస్తులు, నాకు తండ్రి  సమానులైన ప్రముఖ దర్శకులు EVV సత్యనారాయణ (EVV SatyaNarayana)గారికి అంకితమిస్తున్నాము..’’ అని తెలిపారు. 

Updated Date - 2022-05-26T00:25:48+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!