ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎప్పుడు దయ కలుగుతుందో..!!: మురళీమోహన్

ABN , First Publish Date - 2022-04-03T05:17:31+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎప్పుడు దయ కలుగుతుందో అవార్డులు ఇవ్వడానికి.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సీనియర్ నటుడు, రాజకీయ నాయకుడైన మురళీమోహన్. చిత్ర పరిశ్రమకు సంబంధించిన అన్ని విభాగాల నుంచి.. సీనియర్ కళాకారులను, కార్మికులను ఎంపిక

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎప్పుడు దయ కలుగుతుందో..!!: మురళీమోహన్

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎప్పుడు దయ కలుగుతుందో అవార్డులు ఇవ్వడానికి.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సీనియర్ నటుడు, రాజకీయ నాయకుడైన మురళీమోహన్. చిత్ర పరిశ్రమకు సంబంధించిన అన్ని విభాగాల నుంచి.. సీనియర్ కళాకారులను, కార్మికులను ఎంపిక చేసి వారికి ఉగాది పురస్కారాలు ప్రదానం చేశారు.. నేస్తం ఫౌండేషన్ వ్యవస్థాపకులు జె.వి.మోహన్ గౌడ్, తెలుగు సినిమా వేదిక వ్యవస్థాపకులు పాకలపాటి విజయ్ వర్మ, కూనిరెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకులు కూనిరెడ్డి శ్రీనివాస్. ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మురళీమోహన్ బ్రహ్మానందం, సి. కల్యాణ్ హాజరయ్యారు. 


హైదరాబాద్, ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మురళీమోహన్ మాట్లాడుతూ.. సినీనటులకు అవార్డులు ఆక్సిజన్ లాంటివి. నంది అవార్డుల ప్రధానోత్సవాన్ని ప్రభుత్వాలు పక్కన పెట్టాయి. ఏడేళ్ల నుంచి నంది అవార్డులు ఇవ్వడం లేదు. ఈ అవార్డులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎప్పుడు దయ కలుగుతుందో..! ప్రైవేటు సంస్థలు నటీనటులకు అవార్డులు ఇస్తున్నాయి.. కానీ ప్రభుత్వాలు వదిలేశాయి. కళాకారులను గుర్తించి, వారిని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వాలు ఉండాలి.. అని అన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో స్టూడియో సెక్టార్ నుంచి రమేష్ ప్రసాద్‌కు మురళీమోహన్, బ్రహ్మానందం ఉగాది పురస్కారాన్ని అందజేశారు.Updated Date - 2022-04-03T05:17:31+05:30 IST

Read more