Mohanbabu: అది సొంత డబ్బా కాదు!

ABN , First Publish Date - 2022-10-14T06:10:52+05:30 IST

కొన్ని సందర్భాల్లో చేసిన పనుల గురించి మాట్లాడాలి. అది సొంత డబ్బా కొట్టుకోవటం కాదు. ‘మా’ కోసం విష్ణు కష్టపడుతున్నాడు. తను చేసే పనుల్లో మోసం, దగా లేదు’’ అని మోహన్‌బాబు అన్నారు.

Mohanbabu: అది సొంత డబ్బా కాదు!

కొన్ని సందర్భాల్లో చేసిన పనుల గురించి మాట్లాడాలి. అది సొంత డబ్బా కొట్టుకోవటం కాదు. ‘మా’ కోసం విష్ణు కష్టపడుతున్నాడు. తను చేసే పనుల్లో మోసం, దగా లేదు’’ అని మోహన్‌బాబు (Mohanbabu)అన్నారు. ‘మా’ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా విష్ణు (Manchu vishnu)పదవీ బాధ్యతలు తీసుకుని ఏడాది పూర్తైన సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. మంచు మోహన్‌బాబు(Mohanbabu) మాట్లాడుతూ ‘‘మా’ ఎన్నికలు ఏ విధంగా జరిగాయో అందరికీ తెలుసు. గెలుపును తట్టుకోలేనివారు ఏం చేశారో అంతా చూశారు. ఎన్నికల్లో విష్ణు గెలవాలని కోరుకున్నవారితోపాటు ఓడిపోవాలని కోరుకున్నవారు బాగుండాలి. నేను ‘మా’ అధ్యక్షుడిగా పనిచేసినప్పుడూ ఇలాంటి మీటింగ్‌లు ఎప్పుడూ పెట్టలేదు. చేసిన పనుల గురించి బయటకు చెప్పుకోలేదు. అలా చెప్పుకోవడం సొంత డప్పు కొట్టుకోవడం కాద. అందరూ ఐక్యంగా ఉండండి’’ అని అన్నారు. (Vishnu complete one year as Maa President)


‘‘ఎన్నికల్లో ఇచ్చిన మ్యానిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం 90 శాతం పూర్తి చేశాం. ‘మా’ కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నాం.  ఓటు హక్కు లేదు, సభ్యత్వం ఉన్నవారే సినిమాల్లో నటింపజేయాలని నిర్మాతలకు చెప్పాం. మా సూచనలను నిర్మాతల మండలి పరిగణనలోకి తీసుకుంటామని మాటిచ్చారు. ‘మా’కు వ్యతిరేకంగా నటులు కార్యవర్గ సభ్యులు ధర్నాలు, చేసినా, సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెట్టిన మీడియాకు వెళ్లినా సభ్యత్వం శాశ్వతంగా రద్దు చేస్తాం’’ అని విష్ణు తెలిపారు. 


Updated Date - 2022-10-14T06:10:52+05:30 IST