తండ్రీకొడుకుల కథతో మోహన్‌లాల్‌ ‘వృషభ’

ABN , First Publish Date - 2022-08-28T06:37:39+05:30 IST

మలయాళ చిత్రరంగ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ కొత్త చిత్రం వివరాలు శనివారం ప్రకటించారు. ఆ చిత్రం పేరు ‘వృషభ’.

తండ్రీకొడుకుల కథతో మోహన్‌లాల్‌ ‘వృషభ’

లయాళ చిత్రరంగ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ కొత్త చిత్రం వివరాలు శనివారం ప్రకటించారు. ఆ చిత్రం పేరు ‘వృషభ’. మలయాళ, తెలుగు భాషల్లో నిర్మితమయ్యే ఈ చిత్రంలో తండ్రీకొడుకుల పాత్రలు కీలకం. తండ్రిగా మోహన్‌లాల్‌ నటించనున్నారు. తెలుగులో అగ్ర హీరో కొడుకు పాత్ర పోషిస్తారని చిత్ర నిర్మాత అభిషేక్‌ వ్యాస్‌ చెప్పారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసిన అభిషేక్‌ బయటకు వచ్చేసి ఏవీఎస్‌ స్టూడియోస్‌ పేరుతో చిత్రనిర్మాణ సంస్థను నెలకొల్పారు. ఇంతవరకూ పలు భాషల్లో ఆరు చిత్రాలు నిర్మించిన ఏవీఎస్‌ స్టూడియోస్‌ నిర్మించే తొలి భారీ పాన్‌ ఇండియా ఫిల్మ్‌ ఇది. మలయాళ, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించి తమిళ, కన్నడ, హిందీ భాషల్లోకి అనువదిస్తారు. ఈ చిత్రంలో నటించే తెలుగు హీరో ఎవరన్నది తర్వాత వెల్లడిస్తామని అభిషేక్‌ వ్యాస్‌ చెప్పారు. ‘వృషభ’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న నందకిశోర్‌ మాట్లాడుతూ ‘ఐదేళ్లుగా ఈ స్ర్కిప్ట్‌ మీద వర్క్‌ చేస్తున్నాను. మోహన్‌లాల్‌గారితో పనిచేయాలన్న నా కల నెరవేరుతోంది’ అన్నారు. వచ్చే ఏడాది మే నెలలో ‘వృషభ’ చిత్రాన్ని ప్రారంభించి, 2024 ప్రారంభంలో విడుదల చేయాలన్నది నిర్మాతల ఆలోచన. ప్రపంచ వ్యాప్తంగా  3 వేలకు పైగా థియేటర్లలో విడుదల చేస్తామని చెబుతున్నారు. 

Updated Date - 2022-08-28T06:37:39+05:30 IST