Mahesh Babu: మహేష్ త్రివిక్రమ్ సినిమాలో మోహన్ బాబు?
ABN , First Publish Date - 2022-09-27T20:45:53+05:30 IST
మహేష్ బాబు (Mahesh Babu) మరియు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్ (Combination) లో వస్తున్న సినిమా షూటింగ్ మొదలయింది.

మహేష్ బాబు (Mahesh Babu) మరియు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్ (Combination) లో వస్తున్న సినిమా షూటింగ్ మొదలయింది. అయితే ఇందులో ఇంకా నటీనటుల ఎంపిక జరగలేదు, కొనసాగుతూనే వుంది. కథానాయికగా పూజ హెగ్డే పేరును చాల నెలల క్రితమే ప్రకటించారు. అయితే మిగతా నటుల కోసం త్రివిక్రమ్ అతని టీం అన్వేషణ చేస్తూనే వున్నారు. ఎందుకంటే ఈ సినిమా పాన్ ఇండియా (Pan India) స్థాయిలో తీయాలని, అందుకోసం మలయాళం, తమిళ్, హిందీ నుండి నటులను తీసుకోవాలని చూస్తున్నారు. కానీ వీళ్ళు అనుకున్న నటులు ఎవరూ ప్రస్తుతం కాళీ లేకపోవటం తో ఇంకా ఆ సెర్చ్ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే, ఈ సినిమా గురించి చిన్న లీక్స్ మహేష్ బాబు అభిమానులకి (Mahesh Babu fans) వచ్చిందని అంటున్నారు. ఇందులో సీనియర్ మరియు విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్ అని పిలవబడే మోహన్ బాబు (Manchu Mohan Babu) నటిస్తున్నారని. ఇది ఎంతవరకు నిజమో తెలీదు కానీ, ఈ వార్తని మహేష్ అభిమానులు చర్చించు కుంటున్నట్టు తెలిసింది. మరి మోహన్ బాబు ని అప్రోచ్ అయ్యారా లేదా అన్న విషయం కూడా ఇంకా తెలియదు. మోహన్ బాబు కుటుంబానికి, మహేష్ తండ్రి కృష్ణ (Actor Krishna) కుటుంబానికి మంచి సన్నిహిత సంబంధాలు వున్నాయి. అందుకని మోహన్ బాబు ని అప్రోచ్ అయితే అయన వొప్పుకోవచ్చు అని కూడా అంటున్నారు. మరిన్ని అప్ డేట్స్ కోసం ఇక్కడ చూడండి. (Watch this space for more updates)