సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

మొదటి సినిమా విడుదల కాకముందే.. ముగ్గురు మెగా హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిందిగా..!

ABN, First Publish Date - 2022-04-18T22:25:54+05:30

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న అందాల భామ సాక్షి వైద్య. గతంలో అనేక యాడ్‌లల్లో నటించింది. ఆమె నటించిన ఓ యాడ్ టాలీవుడ్ దర్శకుడు సురేందర్ రెడ్డి కంట పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న అందాల భామ సాక్షి వైద్య. గతంలో అనేక యాడ్‌లల్లో నటించింది. ఆమె నటించిన ఓ యాడ్ టాలీవుడ్ దర్శకుడు సురేందర్ రెడ్డి కంట పడింది. దీంతో సాక్షిని వెండితెరకు పరిచయం చేయాలని అతడు నిర్ణయించుకున్నాడు. అఖిల్ హీరోగా నటిస్తున్న ‘ఏజెంట్’ సినిమాలో కథానాయికగా అవకాశమిచ్చాడు. ఈ చిత్రం స్పై థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ఈ ఏడాది ఆగస్టులో ఈ మూవీ విడుదల కానుంది. సాక్షి నటించిన మొదటి చిత్రం విడుదల కాక ముందే .. ముగ్గురు మెగా హీరోల సరసన ఆమె నటించనున్నట్టు తెలుస్తోంది.   


కొత్త రకం సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో కలసి అతడు ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులో సాక్షి వైద్య ఓ కీలక పాత్ర పోషించనుందట. తొలి సినిమా ‘ఉప్పెన’తోనే బంపర్ హిట్ కొట్టిన మెగా హీరో వైష్ణవ్ తేజ్. ‘కొండపొలం’ తోను ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అతడు చేయబోయే ఓ ప్రాజెక్టులో సాక్షికి అవకాశం దక్కిందని సమాచారం. కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ ఓ సినిమా చేస్తున్నాడు. మిస్టరీ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ మూవీలోను సాక్షి నటించనుందని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి.

Updated Date - 2022-04-18T22:25:54+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!