Merlapaka Gandhi: 'జనాల్ని మార్నింగ్ షోకి తీసుకురావాలనేది మా టార్గెట్'

ABN , First Publish Date - 2022-11-02T21:59:21+05:30 IST

దర్శకుడు మేర్లపాక గాంధీ (Director Merlapaka Gandhi) తనకంటూ ఒక ముద్ర వేసుకొని తెలుగు సినిమాలు చేస్తున్నాడు.

Merlapaka Gandhi: 'జనాల్ని మార్నింగ్ షోకి తీసుకురావాలనేది మా టార్గెట్'

దర్శకుడు మేర్లపాక గాంధీ (Director Merlapaka Gandhi) తనకంటూ ఒక ముద్ర వేసుకొని తెలుగు సినిమాలు చేస్తున్నాడు. గాంధీ సినిమా చేస్తే అది కచ్చితంగా ఆడుతుంది, మంచి సినిమాలే చేస్తాడు అని అనిపించుకున్నాడు తన సినిమాలతో. ఇప్పుడు ఒక వెరైటీ టైటిల్ తో 'లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్' అనే సినిమాతో వస్తున్నాడు. ఇందులో సంతోష్ శోభన్ మరియు ఫరియా అబ్దుల్లా లీడ్ పెయిర్ కాగా, బ్రహ్మాజీ, వెన్నెల కిశోరె ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 

అయితే చిన్న సినిమాలకి ప్రేక్షకులు థియేటర్ కి ఎక్కువ రావటం లేదు కదా, మరి గాంధీ కి కూడా ఆ భయం వుందా అని అడిగితే, వుంది అని చెప్తున్నాడు. అందుకోసమే ఈ సినిమా ప్రచారం చాలా కొత్తగా వైవిధ్యంగా ఉండాలని మొదటి నుండీ చేస్తున్నారు. జనాల్ని మార్నింగ్ షోకి తీసుకురావాలనేది టీం టార్గెట్ అని చెపుతున్నాడు. మంచి టాక్ స్ప్రెడ్ అయితే, సినిమా బావుంటే ఖచ్చితంగా చూస్తారు అన్న ధీమా వ్యక్తం చేసాడు గాంధీ. 


ఈ సినిమా ప్రమోషన్స్ కి చిరంజీవి కూడా బాగా హెల్ప్ అయ్యాడు. అతని సినిమా 'వాల్తేరు వీరయ్య' సినిమా టీజర్ లో ఒక డైలాగ్ లో ఈ 'లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్'  అని చెప్తాడు.  ఇది నిజంగా అనుకోకుండా జరిగింది. 'వాల్తేరు వీరయ్య' లో లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ అనే డైలాగ్ వాడగానే అందరూ గాంధీ సినిమాని ట్యాగ్ చేశారు. చిరంజీవి గారి రూపం లో ఒక అద్భుతం జరిగింది అని చెప్తున్నాడు గాంధీ. (#LikeShareSubscribe #Brahmaji #SantoshSobhan #FariaAbdullah #MerlapakaGandhi)

Updated Date - 2022-11-02T21:59:21+05:30 IST