సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

విజయ్‌ ‘లైగర్‌’ అయింది ఇందుకే!

ABN, First Publish Date - 2022-04-05T18:52:38+05:30

కథ చెప్పడంతో పూరి జగన్నాథ్‌ స్టైల్‌ వేరు. ఆయన కథలు కాస్త డిఫరెంట్‌గా ఉంటాయి. స్ర్కీన్‌పై ప్రజంట్‌ చేసూ తీరు అలాగే ఉంటుంది. మాటలు బోల్డ్‌గా ఉంటాయి. కథ విషయం అలా ఉంచితే ఆయన రాసే తూటాల్లాంటి మాటలే ఆయన సినిమాల సక్సెస్‌కు ఓ కారణం అనొచ్చు. ‘లైగర్‌’ కూడా అలాంటి ప్రత్యేకతలతోనే తెరకెక్కుతోంది. విజయ్‌ దేవరకొండ హీరోగా ఆయన దర్శకత్వం వహిస్తున్న ‘లైగర్‌’ చిత్రం ప్యాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కథ చెప్పడంతో పూరి జగన్నాథ్‌ స్టైల్‌ వేరు. ఆయన కథలు కాస్త డిఫరెంట్‌గా ఉంటాయి. స్ర్కీన్‌పై ప్రజంట్‌ చేసూ తీరు అలాగే ఉంటుంది. మాటలు బోల్డ్‌గా ఉంటాయి. కథ విషయం అలా ఉంచితే ఆయన రాసే తూటాల్లాంటి మాటలే ఆయన సినిమాల సక్సెస్‌కు ఓ కారణం అనొచ్చు. ‘లైగర్‌’ కూడా అలాంటి ప్రత్యేకతలతోనే తెరకెక్కుతోంది. విజయ్‌ దేవరకొండ హీరోగా ఆయన దర్శకత్వం వహిస్తున్న ‘లైగర్‌’ చిత్రం ప్యాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రానికి ‘సాలా క్రాస్‌ బ్రీడ్‌’ అని క్యాప్షన్‌ పెట్టి మరింత ఆసక్తి పెంచారు పూరి. ఈ చిత్రంలో దిగ్గజ బాక్సర్‌ మైక్‌ టైసన్‌ కోచ్‌ పాత్రల్లో కనిపించినున్నారు. ఈ చిత్రంలో మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. మైక్‌ టైసన్‌ ఇందులో విజయ్‌ దేవరకొండకు తండ్రిగా నటిస్తున్నారు. ఫస్టాఫ్‌లో కోచ్‌గా కనిపించే టైక్‌ టైసన్‌ పాత్ర ఫ్లాష్‌ బ్యాక్‌లో తండ్రిగా కనిపిస్తారట. గతంలో పూరి జగన్నాథ్‌ అందించిన హిట్‌ చిత్రం ‘అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి’ చిత్రంలో కూడా ప్రకాశ్‌రాజ్‌ పాత్ర అలాగే ఉంటుంది. అయితే ఇక్కడ మైక్‌ విదేశీ వ్యక్తి. విజయ్‌ దేవరకొండ పాత్ర స్వదేశానికి సంబంధించినది. ఈ కారణంతో ఈ చిత్రానికి ‘సాలా క్రాస్‌ బ్రీడ్‌’ అనే క్యాప్షన్‌ ఇచ్చినట్లు ఉన్నారు. స్వదేశీ కొడుకు , విదేశీ తండ్రి పాత్రలను పూరి జగన్‌ ఎలా తీర్చిదిద్దారో చూడాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే! 


Updated Date - 2022-04-05T18:52:38+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!