సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘లైగర్’: ధన్యవాదాలంటోన్న మైక్ టైసన్

ABN, First Publish Date - 2022-04-01T23:12:23+05:30

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ కాంబినేషన్‌లో భారీ అంచనాలతో రూపొందుతోన్న చిత్రం ‘లైగర్’. చిత్రీకరణ పూర్తి చేసుకుని.. పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రంతో ప్రపంచ బాక్సర్ మైక్ టైసన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ కాంబినేషన్‌లో భారీ అంచనాలతో రూపొందుతోన్న చిత్రం ‘లైగర్’. చిత్రీకరణ పూర్తి చేసుకుని.. పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రంతో ప్రపంచ బాక్సర్ మైక్ టైసన్ భారతీయ సినిమాలోకి అడుగుపెడుతున్నారు. యుఎస్ఏలో విజయ్ దేవరకొండతో పాటు మైక్ టైసన్‌కి సంబంధించిన సన్నివేశాలను ఇటీవల చిత్రీకరించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రంలోని తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్‌ను పూర్తి చేసినట్లుగా మైక్ టైసన్ ప్రకటించారు. ‘ఈ సినిమాలో నన్ను కూడా భాగం చేసినందుకు ధన్యవాదాలు’ అని మైక్ టైసన్ ఒక వీడియోలో తెలిపారు.


మైక్ టైసన్ ఈ చిత్రంలో ఒక శక్తివంతమైన పాత్రలో నటించినట్లుగా.. అతనిపై చిత్రీకరించిన సన్నివేశాలు చిత్రంలో ప్రధాన హైలైట్‌లలో ఒకటిగా ఉంటాయని మేకర్స్ ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌తో కలిసి, ఈ చిత్రాన్ని బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా ఈ చిత్రానికి నిర్మాతలు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని 2022 ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు.





Updated Date - 2022-04-01T23:12:23+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!