సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Michael: ఫస్ట్ లుక్ పోస్టర్‌ వచ్చేసింది..

ABN, First Publish Date - 2022-05-07T15:05:28+05:30

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మైఖేల్. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో బహుభాషలలో తెరకెక్కిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మైఖేల్. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో బహుభాషలలో తెరకెక్కిస్తున్నారు. రొటీన్ లవ్ స్టోరి, గుండెల్లో గోదారి, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, జోరు లాంటి చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సందీప్ కిషన్. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ యంగ్ హీరో సినిమాలు చేసి అక్కడ కూడా మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు.


అయితే, ఈ మధ్య సందీప్ కిషన్‌కు ఆశించిన సక్సెస్‌లు దక్కడం లేదు. గత చిత్రం గల్లీ రౌడీ కూడా హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ భారీ కమర్షియల్ సక్సెస్‌ను మాత్రం సాధించలేదు. దాంతో ఇప్పుడు చేస్తున్న మైఖేల్ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. దీనికోసం బాగానే శ్రమిస్తున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రంజిత్ జేయకొడి తెరకెక్కిస్తున్నాడు. శ్రీ వేంకటేశ్వర సినిమాస్ - కరణ్ సి ప్రొడక్షన్స్ పతాకాలపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


ఈ మూవీని ప్రకటించినప్పటి నుంచే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇందులో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, దర్శకుడు గౌతమ్ మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా, ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను వదిలింది చిత్రబృందం. ఈ పోస్టర్‌లో సందీప్ సిక్స్ ప్యాక్ బాడీతో చేతిలో తుపాకి పట్టుకొని కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ చూస్తుంటే యాక్షన్ సీన్స్ ఎక్కువగానే ఉన్నాయని అర్థమవుతోంది. మొత్తంగా మైఖేల్ సినిమా నుంచి తాజాగా విడుదలైన సందీప్ కిషన్ పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది. కాగా, ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

Updated Date - 2022-05-07T15:05:28+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!