మైఖేల్‌ వచ్చేశాడు

ABN , First Publish Date - 2022-05-08T05:51:15+05:30 IST

సందీప్‌కిషన్‌, విజయ్‌సేతుపతి కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘మైఖేల్‌’. రంజిత్‌ జయకోడి దర్శకుడు. భరత్‌ చౌదరి, పున్కూర్‌ రామ్‌ మోహన్‌రావు నిర్మాతలు...

మైఖేల్‌ వచ్చేశాడు

సందీప్‌కిషన్‌, విజయ్‌సేతుపతి కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘మైఖేల్‌’. రంజిత్‌ జయకోడి దర్శకుడు. భరత్‌ చౌదరి, పున్కూర్‌ రామ్‌ మోహన్‌రావు నిర్మాతలు. శనివారం సందీప్‌ కిషన్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘మైఖేల్‌’ ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. ఆరు పలకల దేహంతో, ఒంటి నిండా గాయాలతో, చేతిలో పిస్తోల్‌ పట్టుకున్న సందీప్‌ కిషన్‌ పోస్టర్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. దివ్యాంశ కౌశిక్‌ కథానాయిక. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, వరుణ్‌ సందేశ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 


ఊరు పేరు భైరవ కోన

సందీప్‌ పుట్టిన రోజు సందర్భంగా మరో సినిమాకి సంబంధించిన ఆప్‌ డేట్‌ కూడా వచ్చేసింది. సందీప్‌ కథానాయకుడిగా, విఐ ఆనంద్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి ‘ఊరు పేరు భైరవకోన’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. శనివారం ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. కావ్య థాపర్‌, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటిస్తున్నారు. నిర్మాత: రాజేష్‌ దండా.


Updated Date - 2022-05-08T05:51:15+05:30 IST

Read more