మెగా కలయిక

ABN , First Publish Date - 2022-03-17T09:32:56+05:30 IST

సల్మాన్‌ఖాన్‌ గతంలో చాలాసార్లు చిరంజీవిని కలిశారు. కానీ ఈ సారి మాత్రం వారి కలయిక అరుదైనది. చిరంజీవి హీరోగా చేస్తున్న 153వ చిత్రం...

మెగా కలయిక

సల్మాన్‌ఖాన్‌ గతంలో చాలాసార్లు చిరంజీవిని  కలిశారు. కానీ ఈ సారి మాత్రం వారి కలయిక అరుదైనది. చిరంజీవి హీరోగా చేస్తున్న 153వ చిత్రం ‘గాడ్‌ ఫాదర్‌’లో సల్మాన్‌ఖాన్‌ పవర్‌ఫుల్‌ పాత్ర చేస్తున్నారు. తాజాగా సెట్స్‌లోకి సల్మాన్‌ అడుగుపెట్టారు. ముంబైలో చిరంజీవితో కలసి షూటింగ్‌లో పాల్గొంటున్నారు. సల్మాన్‌కు పుష్పగుచ్చంతో చిరంజీవి స్వాగతం పలికారు. ‘గాడ్‌ ఫాదర్‌, భాయ్‌... సల్మాన్‌ఖాన్‌కి స్వాగతం. మీరాక ప్రతి ఒక్కరిలో ఉత్తేజం, ఉత్సాహం కలిగించింది. మీతో తెరను పంచుకోవడం గొప్ప ఆనందాన్నిస్తోంది. ఈ సినిమాలో మీ యాక్షన్‌ అభిమానులకు మంచి కిక్‌ ఇస్తుందనడంలో సందేహం లేదు’ అని చిరంజీవి గురువారం ట్వీట్‌ చేశారు. మలయాళ చిత్రం ‘లూసిఫర్‌కి ఇది తెలుగు రీమేక్‌. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. నయనతార కీలకపాత్ర పోషిస్తున్నారు. మోహన్‌రాజా దర్శకత్వంలో ఆర్‌.బి చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు.


Updated Date - 2022-03-17T09:32:56+05:30 IST

Read more