Mega Carnival: అనుకున్నదొకటి అయినదొక్కటి

ABN , First Publish Date - 2022-08-23T19:40:04+05:30 IST

గత రెండు వరాల నుండి మెగా కార్నివాల్ రూపం లో మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi) పుట్టిన రోజు వేడుకలను ఘనంగా చెయ్యాలనుకున్న మెగా ఆలోచన చివరికి పెద్ద ప్లాప్ అయింది.

Mega Carnival: అనుకున్నదొకటి అయినదొక్కటి

గత రెండు వరాల నుండి మెగా కార్నివాల్ రూపం లో మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi) పుట్టిన రోజు వేడుకలను ఘనంగా చెయ్యాలనుకున్న మెగా ఆలోచన చివరికి పెద్ద ప్లాప్ అయింది. ఈ మెగా కార్నివాల్ అంటూ రెండు వారాల ముందు నుంచే ప్రచార కార్యక్రమం చేపట్టి, చివరగా మాదాపూర్ లో ఘనంగా చెయ్యాలనుకోవడానికి ఒక కారణం వుంది. ‘ఆచార్య’ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి పరువు పోయింది. ఎంతలా అంటే ‘అస్సలు మెగాస్టార్ తదుపరి సినిమాలు జనాలు చూస్తారా’ అని అనుమానం కలిగేంతగా. పోయిన ఆ పరువును దక్కించుకోవాలని, ఒక పెద్ద హైప్ తీసుకొచ్చి, మెగాస్టార్ కు జనాల అండ వుంది, చెక్కుచెదరలేదని చెప్పడానికే ఈ కార్నివాల్ ప్లాన్ చేశారు.


అయితే, ఇది చిట్ట చివరికి వచ్చేసరికి మొత్తమంతా పెద్ద ప్లాప్ అయ్యి కూర్చుంది. మొదటి నుండి దీనికి ఆర్గనైజర్ గా ఉంటూ వచ్చిన నాగబాబు (Nagababu) నుంచి సమాచార లోపమే ఈ వైఫల్యానికి కారణం. అభిమానులు ఎక్కువ మంది రావటంతో, వాళ్ళని నియంత్రించటం కష్టమై, పెద్ద తోపులాట జరిగి, చివరికి రసాభాసగా ముగిసింది. మీడియా వాళ్ళందరికి రమ్మని చెప్పి, తీరా అక్కడికి వెళ్లాక వాళ్ళకి నచ్చిన ఆ రెండు చానెల్స్ కి మాత్రమే అనుమతించి, మిగతా వాళ్ళని పొమ్మన్నడం మరింత గందరగోళానికి దారితీసింది.


పోనీ మెగా హీరోస్ ఎవరయినా వచ్చారా అంటే, ఒక్క సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) తప్ప ఇంకెవరూ రాలేదు. అస్సలు హీరో చిరంజీవి- కుటుంబంతో వేరే ఎక్కడో గడిపారని తెలిసింది. వచ్చిన అభిమానులు నిరాశ పడటమే కాకుండా, ఆర్గనైజింగ్ లోపం వల్ల తిట్టుకుంటూ వెనుదిరగాల్సి వచ్చింది.


కొసమెరుపు: ఇదంతా ఇలా ఉంటే, అదే రోజు జూనియర్ ఎన్ఠీఆర్, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ని కలవటం అనే న్యూస్ వైరల్ గా మారటంతో ఈ చిరంజీవి పుట్టిన రోజు వేడుకలను ఎవరూ పట్టించుకోలేదు. రెండు మూడు వారాలుగా ప్లాన్ చేసిన ఈ మెగా పుట్టినరోజు వేడుక అంతా బూడిదలో పోసిన పన్నీరు అయింది. మెగా ఫామిలీ అనుకున్నది ఒకటి అయితే, అయినది ఇంకొక్కటి అయింది.


- సురేష్ కవిరాయని

Updated Date - 2022-08-23T19:40:04+05:30 IST