సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Nagababu: అన్నయ్య బర్త్‌డేకి నాగబాబు ట్రీట్ ఇదే!

ABN, First Publish Date - 2022-08-23T02:12:10+05:30

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) పుట్టినరోజు పురస్కరించుకుని.. ఆయన సోదరుడు, మెగా బ్రదర్ నాగబాబు (Mega Brother Nagababu) సరికొత్త లుక్‌తో మెగాభిమానులకు ట్రీట్ ఇచ్చారు. సూపర్‌స్టార్ కృష్ణ‌ (Krishna)..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) పుట్టినరోజు పురస్కరించుకుని.. ఆయన సోదరుడు, మెగా బ్రదర్ నాగబాబు (Mega Brother Nagababu) సరికొత్త లుక్‌తో మెగాభిమానులకు ట్రీట్ ఇచ్చారు. సూపర్‌స్టార్ కృష్ణ‌ (Krishna), విజ‌య‌నిర్మల (Vijaya Nirmala) ఫ్యామిలీ నుంచి శ‌రణ్ కుమార్ హీరోగా ప‌రిచయం అవుతున్న చిత్రం ‘సాక్షి’ (Sakshi). చిత్ర హీరో శరణ్ కుమార్ (Sharan Kumar) ‌లుక్‌ని ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. శివ కేశ‌న కుర్తి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ వెన్నెల క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.3గా మునగాల సుధాక‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాగబాబు విలన్‌గా నటిస్తున్నట్లుగా తెలుపుతూ.. ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిరు బర్త్‌డే స్పెషల్‌గా విడుదల చేశారు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, బెక్కెం వేణు గోపాల్, దాము సంయుక్తంగా ఈ పోస్టర్‌ను విడుదల చేసి.. చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. అలాగే చిత్రయూనిట్‌ ఆల్ ద బెస్ట్ చెప్పారు.


అనంతరం చిత్ర నిర్మాత మునగాల సుధాకర్ రెడ్డి (Munagala Sudhakar Reddy) చిత్ర విశేషాల గురించి చెబుతూ.. ‘‘అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మా ‘సాక్షి’ చిత్రంలో విలన్‌గా నటించిన నాగబాబుగారి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన నిర్మాతలు దిల్ రాజుగారికి, బెక్కెం వేణు గోపాల్‌గారికి, దాముగారికి చాలా థాంక్స్. వారు మా సినిమా కోసం ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది. విజయనిర్మలగారి ఫ్యామిలీ నుంచి వచ్చిన శరణ్ హీరోగా నటిస్తున్నారు. హీరోయిన్ జాహ్నవి కపూర్. నాగబాబుగారు మెయిన్ విలన్‌గా ముఖ్యమైన పాత్రలో నటించారు. అజయ్, ఇంద్రజ, ఆమని.. ఇలా పెద్ద క్యాస్టింగ్‌తో సినిమా మీ ముందుకు రాబోతోంది. భీమ్స్ సంగీతం అందించారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం..’’ అని అన్నారు.



Updated Date - 2022-08-23T02:12:10+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!