Meena: అది నా డ్రీమ్‌ రోల్‌.. ఆమెను చూస్తే అసూయగా ఉంది

ABN , First Publish Date - 2022-10-02T22:34:47+05:30 IST

సీనియర్‌ నటి మీనా,(Meena) ఐశ్వర్యారాయ్‌ని చూసి (meena jealous of Aishwarya Rai)అసూయపడుతున్నారు. ఆమెను చూస్తే చాలా ఈర్ఝ్యగా ఉందంటూ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు మీనా. తాజాగా ఆమె చేసిన సరదా ట్వీట్‌ వైరల్‌గా మారింది

Meena: అది నా డ్రీమ్‌ రోల్‌.. ఆమెను చూస్తే అసూయగా ఉంది

సీనియర్‌ నటి మీనా,(Meena)  ఐశ్వర్యారాయ్‌ని చూసి (meena jealous of Aishwarya Rai)అసూయపడుతున్నారు. ఆమెను చూస్తే చాలా ఈర్ఝ్యగా ఉందంటూ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు మీనా. తాజాగా ఆమె చేసిన సరదా ట్వీట్‌ వైరల్‌గా మారింది. అసలు విషయంలోకి   వెళ్తే.. ‘పొన్నియిన్‌ సెల్వన్‌’(Ponniyin Selvan)లో ఐశ్వర్యరాయ్‌ పాత్రను ఉద్దేశించి ఆమె ఆ ట్వీట్‌ చేశారు. ‘‘పొన్నియిన్‌ సెల్వన్‌లో ఐశ్వర్య రాయ్‌ పోషించిన నందిని పాత్ర ఎప్పటి నుంచో నా డ్రీమ్‌ క్యారెక్టర్‌. ఆ పాత్రను అత్యద్భుతంగా పోషించిన ఐశ్వర్య రాయ్‌ని చూస్తే అసూయగా ఉంది. నా డ్రీమ్‌ రోల్‌లో నటించే అవకాశం ఆమెకు దక్కింది. నా జీవితంలో మొదటిసారి ఓ వ్యక్తిని చూసి  అసూయపడుతున్నాను. ఇది మనసులో ఉంచుకోలేక బయటపెట్టేస్తున్నా. ఈ చిత్రంలో నటించి మెప్పించిన అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నా’’ అంటూ స్మైలీ ఎమోజీలను జత చేశారు. విక్రమ్‌, ఐశ్వర్యరాయ్‌, త్రిష, కార్తి, జయం రవి, ప్రకాశ్‌రాజ్‌, నందనీ రాయ్‌ వంటి తారలు నటించిన ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించారు.  ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సెప్టెంబర్‌ 30న విడుదల చేశారు. 




Updated Date - 2022-10-02T22:34:47+05:30 IST