మాస్‌ రాజా ఆగయా...

ABN , First Publish Date - 2022-09-24T05:59:58+05:30 IST

రవితేజ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ధమాకా’. శ్రీలీల కథానాయిక. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు...

మాస్‌ రాజా ఆగయా...

రవితేజ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ధమాకా’. శ్రీలీల కథానాయిక. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు. టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మాత. శుక్రవారం ఈ చిత్రం నుంచి ‘బడా ఎంటర్‌టైన్‌మెంట్‌ వాలా ఆగయా... బీసీ సెంటర్లో మోగాలి తాలియా’ అనే మాస్‌ గీతాన్ని విడుదల చేశారు. రామజోగయ్య శాస్ర్తి సాహిత్యం అందించారు. నకాశ్‌ అజీజ్‌ ఈ పాటని ఆలపించారు. భీమ్స్‌ సిసిరోలియో సంగీతాన్ని సమకూర్చారు. ఇది వరకే ‘జింతాక్‌’ అనే పాట విడుదల చేశారు. దానికి మంచి స్పందన వచ్చింది. ‘‘రవితేజ ఇమేజ్‌కు తగినట్టు సాగే పాట ఇది. ఆయన గ్రేస్‌ఫుల్‌ స్టెప్పులు మాస్‌కి మరింత నచ్చేస్తాయి. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ’’న్నారు నిర్మాత. ప్రసన్న కుమార్‌ బెజవాడ కథ, మాటలు, స్ర్కీన్‌ ప్లే అందించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కార్తీక్‌ ఘట్టమనేని, సహ నిర్మాత: వివేక్‌ కూచిభొట్ల.

Updated Date - 2022-09-24T05:59:58+05:30 IST

Read more