మాస్‌.. యాక్షన్‌... ‘హిడింబ’

ABN , First Publish Date - 2022-05-17T05:48:35+05:30 IST

అశ్విన్‌ బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘హిడింబ’. అనీల్‌ కన్నెగంటి దర్శకుడు. గంగపట్నం శ్రీధర్‌ నిర్మాత...

మాస్‌.. యాక్షన్‌... ‘హిడింబ’

అశ్విన్‌ బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘హిడింబ’. అనీల్‌ కన్నెగంటి దర్శకుడు. గంగపట్నం శ్రీధర్‌ నిర్మాత. నందితాశ్వేత కథానాయిక. ఆదివారం ఫస్ట్‌ గ్లింప్స్‌ని విడుదల చేశారు. అశ్విన్‌ని యాక్షన్‌ హీరోగా చూపించే ప్రయత్నం ప్రచార చిత్రాల్లో కనిపిస్తోంది. యాక్షన్‌ సన్నివేశాలకు పెద్ద పీట వేశారు. నందిత శ్వేత పోలీస్‌ అధికారి పాత్రలో దర్శనమిచ్చారు. శుభలేఖ సుధాకర్‌ ఓ కీలకమైన పాత్ర పోషించారు. సాంకేతికంగానూ ఉన్నతంగా తీర్చిదిద్దారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి వికాస్‌ బడిసా సంగీతాన్ని అందించారు.  


Updated Date - 2022-05-17T05:48:35+05:30 IST

Read more