Maruthi: ప్రభాస్ ‘రాజా డీలక్స్’ పట్టాలెక్కేది ఆ రోజే.. వారం రోజుల పాటు డేట్స్ ఇచ్చిన హీరో..

ABN , First Publish Date - 2022-10-14T23:41:27+05:30 IST

‘బాహుబలి’ (Baahubali) ప్రాంచైజీతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరికి చేరువయ్యాడు హీరో ప్రభాస్ (Prabhas). ఈ సినిమా తర్వాత ప్రభాస్ నటించిన ‘సాహో’ (saaho), ‘రాధేశ్యాం’ (Radhe Shyam)

Maruthi: ప్రభాస్ ‘రాజా డీలక్స్’ పట్టాలెక్కేది ఆ రోజే.. వారం రోజుల పాటు డేట్స్ ఇచ్చిన హీరో..

‘బాహుబలి’ (Baahubali) ప్రాంచైజీతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరికి చేరువయ్యాడు హీరో ప్రభాస్ (Prabhas). ఈ సినిమా తర్వాత ప్రభాస్ నటించిన ‘సాహో’ (saaho), ‘రాధేశ్యాం’ (Radhe Shyam) చిత్రాలు ప్రేక్షకులను ఆశించిన మేర మెప్పించలేదు. అయినప్పటికి రెబల్ స్టార్ తన జోరును ఏ మాత్రం తగ్గించడం లేదు. ‘ఆదిపురుష్’ (Adipurush) షూటింగ్‌ను ఇప్పటికే పూర్తి చేశాడు. ‘సలార్’ (Salaar), ‘ప్రాజెక్ట్-కె’ (Project K) షూటింగ్స్‌లో పాల్గొంటున్నాడు. ఈ చిత్రాలు పూర్తి కాకముందే మరో ప్రాజెక్టుకు ఒకే చెప్పాడు. మారుతితో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికరమైన వార్తలు ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రాజెక్టును అక్టోబరులోనే పట్టాలెక్కించబోతున్నారని తెలుస్తోంది. 


ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్రం తెరకెక్కబోతున్నట్టు సమాచారం. ఈ మూవీ షూటింగ్‌ అక్టోబర్ 17న పట్టాలెక్కబోతుందని తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్ వారం రోజుల పాటు పాల్గొనబోతున్నాడట. ఈ చిత్రానికి ‘రాజా డీలక్స్’ (Raja Deluxe) అనే టైటిల్ పరిశీలనలో ఉంది. మాళవిక మోహనన్‌ (Malavika Mohanan), నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) హీరోయిన్స్‌గా నటించనున్నారట. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ (Sanjay Dutt)ను ఓ కీలక పాత్రకు ఎంపిక చేశారట. ప్రభాస్ చేతిలో అనేక ప్రాజెక్టులున్నాయి. అందువల్ల సినిమాలను త్వరగా పూర్తి చేయాలనే ఆలోచనలో విరామమనేది లేకుండా వరుస షూటింగ్స్‌లో పాల్గొంటున్నాడు. 

Updated Date - 2022-10-14T23:41:27+05:30 IST