సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

శివకార్తికేయన్ ‘Prince’లోని యువరాణి లుక్ విడుదల

ABN, First Publish Date - 2022-06-10T21:55:40+05:30

వెర్సటైల్ హీరో శివకార్తికేయన్ ( Sivakarthikeyan), ‘జాతిరత్నాలు’ చిత్ర ఫేమ్ అనుదీప్ కెవి (Anudeep KV) కాంబినేషన్‌లో తెలుగు-తమిళ ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ప్రిన్స్‌’ (Prince). గురువారం ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్‌ని రివీల్ చేసిన మేకర్స్.. ఈ రోజు సినిమాలో హీరోయిన్‌గా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెర్సటైల్ హీరో శివకార్తికేయన్ ( Sivakarthikeyan), ‘జాతిరత్నాలు’ చిత్ర ఫేమ్ అనుదీప్ కెవి (Anudeep KV) కాంబినేషన్‌లో తెలుగు-తమిళ ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ప్రిన్స్‌’ (Prince). గురువారం ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్‌ని రివీల్ చేసిన మేకర్స్.. ఈ రోజు సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోన్న మరియా ర్యాబోషప్క (Maria Ryaboshapka) ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో శివకార్తికేయన్, మరియా ర్యాబోషప్క జంట గోడ పైన కూర్చుని హాయిగా నవ్వుతూ కనిపిస్తున్నారు. తెలుగు అర్థం కాని ర్యాబోషప్క కు శివకార్తికేయన్  సుమతి శతకం భోదిస్తున్నట్లుగా ఈ లుక్ ఉంది. ఈ లుక్‌లో వీరిద్దరి కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. శివకార్తికేయన్ కూల్ అండ్ క్లాస్‌గా, మరియా ర్యాబోషప్కా చాలా అందంగా కనిపిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లానే ఈ పోస్టర్ కూడా.. పాజిటివ్ వైబ్స్‌తో అలరిస్తోంది.


నారాయణ్ దాస్ నారంగ్ (Narayan Das Narang) ఆశీస్సులతో సునీల్ నారంగ్ (Suniel Narang), డి.సురేష్ బాబు (D. Suresh Babu), పుస్కుర్ రామ్ మోహన్ రావు (Puskur Ram Mohan Rao) సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి (Sree Venkateswara Cinemas LLP), సురేష్ ప్రొడక్షన్స్ (Suresh Productions), శాంతి టాకీస్ (Shanthi Talkies) బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోనాలి నారంగ్‌ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. పస్తుతం చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని వినాయకచవితి (Vinayaka Chavithi) పండుగను పురస్కరించుకుని ఆగస్ట్ 31న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ (S. Thaman) ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.



Updated Date - 2022-06-10T21:55:40+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!