ఆ కలతోనే ఎందరో బతుకుతున్నారు

ABN , First Publish Date - 2022-05-08T05:54:02+05:30 IST

‘సినిమా అనేది ప్రతి ఒక్కరి కల. ఈ సినిమాతో మీరంతా ఆ కలను నెరవేర్చుకున్నారు. ఇంకా ఎందరో ఆ కలతో బతుకుతున్నారు....

ఆ కలతోనే ఎందరో బతుకుతున్నారు

‘సినిమా అనేది ప్రతి ఒక్కరి కల. ఈ సినిమాతో మీరంతా ఆ కలను నెరవేర్చుకున్నారు. ఇంకా ఎందరో ఆ కలతో బతుకుతున్నారు. గట్టిగా కృషి చేస్తే వారందరి కల కూడా నెరవేరుతుంది’ అన్నారు ప్రముఖ దర్శకుడు రాజమౌళి. ‘ఓ కల’ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను ఆయన శనివారం ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో విడుదల చేశారు. గౌరీశ్‌ యేలేటి, రోషిణి, ప్రాచీ  ఠక్కర్‌ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ బాగుందని రాజమౌళి అభినందించారు. చిత్ర దర్శకుడు దీపక్‌ కొలిపాక మాట్లాడుతూ ‘ఒక మంచి కథను తెలుగు ప్రేక్షకులకు చెప్పే అవకాశం ఇచ్చిన నిర్మాతకు నా ధన్యవాదాలు. అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైనర్‌గా ఉండే ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుందని చెప్పగలను’ అన్నారు. ‘హిట్‌’ చిత్ర దర్శకుడు శైలేష్‌ కొలను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లక్ష్మీ నవ్య మోతూరు, రంజిత్‌కుమార్‌ కొడాలి, ఆదిత్య రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలు. 


Updated Date - 2022-05-08T05:54:02+05:30 IST

Read more