Manjima Mohan: హీరోతో హీరోయిన్ పెళ్లి ఫిక్స్.. వివాహం ఎప్పుడంటే..

ABN , First Publish Date - 2022-11-02T15:13:54+05:30 IST

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా నటించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైన నటి మంజిమా మోహన్ (Manjima Mohan)...

Manjima Mohan: హీరోతో హీరోయిన్ పెళ్లి ఫిక్స్.. వివాహం ఎప్పుడంటే..

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా నటించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైన నటి మంజిమా మోహన్ (Manjima Mohan). ఆ సినిమా పరాజయం పాలు కావడంతో తెలుగులో ఈ బ్యూటీకి అంతగా అవకాశాలు రాలేదు. కానీ తమిళ, మలయాళం చిత్ర పరిశ్రమల్లో మాత్రం అవకాశాలు అందుకుని అక్కడ మంచి గుర్తింపు సాధించింది. ఈ భామ త్వరలో పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమవుతోంది. వరుడు కోలీవుడ్‌కు చెందిన సీనియర్‌ నటుడు కార్తీక్‌ తనయుడు, యువ హీరో గౌతమ్‌ కార్తీక్‌ (Gautham Karthik).


పెళ్లి విషయాన్ని మంజిమా మోహన్‌ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అధికారికంగా వెల్లడించింది. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఈ విషయం జోరుగా ప్రచారం జరిగినా వారు  పెదవి విప్పలేదు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ తమ ప్రేమను సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అధికారికంగా వెల్లడించారు. వీరి వివాహం ఈ నెలలో జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. కాగా, వీరిద్దరి మధ్య ‘దేవరాట్టం’ సినిమా షూటింగ్‌ సమయంలో ప్రేమ చిగురించి, పెళ్లి వరకు తీసుకువచ్చింది.





Updated Date - 2022-11-02T15:13:54+05:30 IST