హీరోలు... విలన్లూ లేరు!

ABN , First Publish Date - 2022-11-26T07:04:32+05:30 IST

శివ కంఠమనేని, సంజన గల్రాని, ప్రియా హెగ్డే, చాణక్య ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘మణిశంకర్‌’. జివికె దర్శకుడు.

హీరోలు... విలన్లూ లేరు!

శివ కంఠమనేని, సంజన గల్రాని, ప్రియా హెగ్డే, చాణక్య ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘మణిశంకర్‌’. జివికె దర్శకుడు. కె.ఎ్‌స.శంకరరావు, ఆచార్య శ్రీనివాసరావు, ఎం.ఫణిభూషణ్‌ నిర్మాతలు. చిత్రీకరణ పూర్తయింది. జనవరిలో విడుదల చేస్తారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘డబ్బు చుట్టూ తిరిగే కథ ఇది. మనిషి డబ్బు కోసం ఏమైనా చేస్తాడు. ఎవరూ హీరో కాదు.. అలాగని విలనూ కాదు. సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటాడు. ఈ సినిమాలో పాత్రలూ అంతే’’ అన్నారు. ‘‘ఈమధ్య చాలా కథలు విన్నా. అందులో ‘మణిశంకర్‌’ బాగా నచ్చింది. నా పాత్రలో చాలా పార్వ్శాలుంటాయ’’ని సంజన తెలిపారు. 

Updated Date - 2022-11-26T07:04:32+05:30 IST

Read more