‘మణి శంకర్’ మెరుపులు
ABN , First Publish Date - 2022-12-23T04:32:33+05:30 IST
శివ కంఠమనేని, సంజన గల్రాని, ప్రియా హెగ్డే, చాణక్య ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘మణి శంకర్’. జివికె దర్శకుడు...
శివ కంఠమనేని, సంజన గల్రాని, ప్రియా హెగ్డే, చాణక్య ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘మణి శంకర్’. జివికె దర్శకుడు. కె.ఎ్‌స.శంకర్‌రావు, ఆచార్య శ్రీనివాసరాజు, ఎం.ఫణిభూషణ్ నిర్మాతలు. గురువారం హైదరాబాద్‌లో ఆడియోని ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘డబ్బు చుట్టూ తిరిగే కథ ఇది. యాక్షన్, ట్విస్టులు ఆకట్టుకొంటాయి. చాలా కాలం తరవాత సంజన ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఆమె పాత్ర కూడా కొత్తగా ఉంటుంది. జనవరి మొదటి వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామ’’ని దర్శక నిర్మాతలు తెలిపారు.