సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Mani Ratnam: చిరంజీవికి థాంక్స్.. ఎందుకనేది ఇప్పుడే చెప్పను

ABN, First Publish Date - 2022-08-20T01:40:14+05:30

ఏస్ డైరెక్టర్ మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వం వహిస్తున్న ప్రెస్టీజియస్‌ సినిమా ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ (Ponniyin Selvan). లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం.. రెండు భాగాలుగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏస్ డైరెక్టర్ మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వం వహిస్తున్న ప్రెస్టీజియస్‌ సినిమా ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ (Ponniyin Selvan). లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం.. రెండు భాగాలుగా విడుదల కానుంది. పీయస్‌-1ని ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్‌ 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తమిళ్‌, హిందీ, తెలుగు, కన్నడ, మలయాళంలో ఈ సినిమాను ఏక కాలంలో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ చిత్రంలోని ‘చోళ చోళ’ (Chola Chola) అనే లిరికల్ సాంగ్‌ను హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు.  


ఈ కార్యక్రమంలో దర్శకుడు మణిరత్నం మాట్లాడుతూ.. ‘‘చిరంజీవి (Chiranjeevi)గారికి థాంక్స్ చెప్పాలి. కానీ అది ఎందుకు అనేది చెప్పను. తరువాత మీకే తెలుస్తుంది. రాజమౌళి(Rajamouli)గారికి థాంక్స్ చెప్పాలి. ఆయన వల్లే ఇలాంటి చిత్రాలు తీయగలమనే ధైర్యం వచ్చింది. రెండు పార్టులుగా ఇలాంటి చిత్రాలు తీసి మెప్పించవచ్చని ‘బాహుబలి’ (Bahubali)తో ఆయన నిరూపించారు. అందుకే ఆయనకు థాంక్స్. నా బిడ్డలాంటి ఈ చిత్రం ఇక దిల్ రాజు (Dil Raju)గారిదే. ఆయనే తెలుగులో ఈ సినిమాను చూసుకోవాలి. తనికెళ్ల భరణిగారికి థాంక్స్. చిత్రం కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఈ సినిమాను తీయడం మాకు ఎంతో గర్వంగా ఉంది. ఈ చిత్రాన్ని అందరూ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను’’ అని అన్నారు.


మణిరత్నం సతీమణి సుహాసిని (Suhasini Maniratnam) మాట్లాడుతూ.. ‘‘మా పుట్టింటి (టాలీవుడ్)కి మా వారు వచ్చారు. ఇది నా పుట్టిళ్లు. ఈ సినిమాకు మీరంతా సపోర్ట్‌గా ఉంటారని ఆశిస్తున్నాను. పొన్నియన్ సెల్వన్ చిత్రాన్ని చాలా కష్టపడి తీశారని అంటారు. కానీ ఆయన కష్టపడి తీయరు.. ఇష్టపడి తీస్తారు. ఇది డ్రీమ్ ప్రాజెక్ట్ అని అడిగితే.. కాదు నాకు ఇష్టమైన చిత్రమని అంటాడు. నేను ఆయన్ను ఇష్టపడ్డాను.. ఆయన ఈ చిత్రాన్ని ఇష్టపడ్డారు. అంటే మీరు (ప్రేక్షకులు) ఈ చిత్రాన్ని ఇష్టపడాలి.. వేరే దారి లేదు’’ అని నవ్వుతూ చెప్పుకొచ్చారు.

Updated Date - 2022-08-20T01:40:14+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!