Manchu Vishnu: ఇదే చివరిసారి.. ఆ రోజే మాట్లాడతా!

ABN , First Publish Date - 2022-09-28T06:41:25+05:30 IST

ఏ ఎలక్షన్స్‌లోనూ పోటీ చేయను నేను టాప్‌ ఫైవ్‌ జాబితాలో లేను.. దాని కోసం కృషి చేస్తున్నా.. ఏ హీరో ముందుకు రావడం లేదు.. నంబర్‌వన్‌ కన్నింగ్‌ ఫెలోని అది శాశ్వతం కాదు – మంచు విష్ణు

Manchu Vishnu: ఇదే చివరిసారి.. ఆ రోజే మాట్లాడతా!

ఏ ఎలక్షన్స్‌లోనూ పోటీ చేయను 

నేను టాప్‌ ఫైవ్‌ జాబితాలో లేను.. (Top Five list)

దాని కోసం కృషి చేస్తున్నా..

ఏ హీరో ముందుకు రావడం లేదు..

నంబర్‌వన్‌ కన్నింగ్‌ ఫెలోని

అది శాశ్వతం కాదు

 – మంచు విష్ణు(Manchu vishnu)


‘‘నేను ఇకపై ఏ ఎలక్షన్స్‌లోనూ పోటీ చేయను. ఇదే చివరిసారి. రాజకీయాల్లోకి (No politics)వచ్చేందుకు రంగం సిద్థం చేస్తున్నాను అని చెప్పుకుంటున్న మాటల్లో కూడా వాస్తవం లేదు. నటుడిగా లైఫ్‌ బాగుంది. మంచి నటుడిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకునేందుకు కృషి చేస్తున్నా’’ అని మంచు విష్ణు (Manchu vishnu)అన్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘జిన్నా’(Ginna). అక్టోబర్‌ 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయనపై నెగటివ్‌ మీమ్స్‌ చేసిన వారినీ, యూట్యూబ్‌లో నెగటివ్‌ కంటెంట్‌ పోస్ట్‌ చేసిన వారిని పిలిచి మంగళవారం మాట్లాడారు. వారు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చారు. మీమ్స్‌తో తన ఫ్యామిలీని టార్గెట్‌ చేసి రాసేవారిని వదిలిపెట్టనని హెచ్చరించారు విష్ణు. ‘‘మిమ్మల్ని ట్రోల్‌ చేస్తుంటే పట్టించుకోరేంటి అని ‘మా’ ఎలక్షన్స్‌ టైమ్‌లో చాలామంది నన్ను అడిగారు.  అప్పుడు నా దృష్టంతా ఎన్నికల మీదే ఉంది. ఇప్పుడు ట్రోల్స్‌ చేసే వారిపై దృష్టి. పెట్టా. నా కుటుంబాన్ని టార్గెట్‌ చేసుకుని కొందరు విమర్శించారు. దానిపై సైబరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేస్తే జూబ్లీహిల్స్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీతోపాటు ఓ ప్రముఖ నటుడి ఆఫీస్‌ అడ్రస్‌ తెలిసింది. వారిపై త్వరలో లీగల్‌గా చర్చలు తీసుకొంటారు. మహిళలను విమర్శిేస్త ‘మా’ చాలా సీరియస్‌గా తీసుకుంటుంది’’ అని మంచు అన్నారు.


నంబర్‌వన్‌ కన్నింగ్‌ ఫెలోని...

అగ్ర దర్శకులతో సినిమా అంటే ఆ జాబితాలో రాజమౌళి ముందుంటారు. కొందరు దర్శకులను తమ చిత్రాల్లో కీలక పాత్రలుంటే ఇవ్వమని అడిగా. చాలామంది ఓకే అని చెప్పిన వారు హ్యాండ్‌ ఇచ్చారు. కొత్తవారితో పని చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇండస్ర్టీలో స్నేహితులు, శత్రువులు శాశ్వతం కాదు. ఇన్నోసెన్స్‌కి, నాకు మధ్య చాలా దూరం ఉంది. నేను నంబర్‌వన్‌ కన్నింగ్‌ ఫెలోని.


బిల్డింగ్‌ గురించి ఆ రోజే మాట్లాడతా..

అక్టోబర్‌ పదో తేదీకి ‘మా’ అధ్యక్షుడిగా గెలిచి ఏడాది అవుతుంది. ఆ రోజు ఏర్పాటు చేసే కార్యక్రమంలో మేం ఏం చేశాం.. ఏం సాధించాం’ అన్నది చెబుతాను. ఇకపై ఏ ఎలక్షన్స్‌లోనూ నేను పోటీ చేసేది లేదు. ఇదే చివరిసారి.  నటుడిగా లైఫ్‌ బాగుంది. మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకునేందుకు కృషి చేస్తున్నా. 


ఎవరూ ముందుకు రావడం లేదు...

సినిమా తీసిన ఏ నిర్మాత అయినా తన చిత్రం సక్సెస్‌ కావాలని కోరుకుంటాడు. ఈ సినిమా విషయంలో నేను హీరోని. నాన్న నిర్మాత. నిజం మాట్లాడుకుంటే.. టాప్‌ ఫైవ్‌ హీరోల జాబితాలో నేను లేను. ఇది అందరికీ తెలిసిందే. టాప్‌ 5–3–1లో నిలవాలనుంది. దానికి తగ్గ కృషి చేస్తాను. ఫెయిల్యూర్‌ వచ్చినప్పుడు దిగులుపడితే ఉపయోగం ఏమీ ఉండదు. ప్రతి శుక్రవారం నటుల జీవితం మారిపోతుంది. ఇక్కడ 50 శాతం హార్డ్‌ వర్క్‌, 50 శాతం లక్‌ ఉండాలి. నేను కష్టపడుతున్నా.. అదృష్టం కలిసొస్తుందనుకుంటున్నా. మల్టీస్టారర్‌ ట్రెండ్‌ నడుస్తోందని తెలుసు. నా తదుపరి చిత్రం కోసం చాలామంది హీరోలను అడిగా. ఎవరూ ముందుకు రావడం లేదు. 


Updated Date - 2022-09-28T06:41:25+05:30 IST