Manchu Vishnu: ‘మా’ భవనానికి రెండు ఆప్షన్లు!

ABN , First Publish Date - 2022-10-14T02:57:59+05:30 IST

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ నూతన భవంతికి రెండు ఆప్షన్‌లను అసోసియేషన్‌ ముందుంచానని అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. గురువారానికి అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు.

Manchu Vishnu: ‘మా’ భవనానికి రెండు ఆప్షన్లు!

మూవీ ఆర్టిస్ట్స్‌ (Maa) అసోసియేషన్‌ నూతన భవంతికి రెండు ఆప్షన్‌లను(Two options for MAa building) అసోసియేషన్‌ ముందుంచానని అధ్యక్షుడు మంచు విష్ణు (manchu vishnu)తెలిపారు. గురువారానికి అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏడాది కార్యచరణను ఆయన తెలిపారు. ‘‘ఈ విడత ‘మా’ ఎలక్షన్లు హోరాహోరీగా జరిగాయి. ప్రతి ఒక్కరికీ జవాబుదారీగానే భావిస్తున్నా, మ్యానిఫెస్టోలో ఇచ్చిన మాటల్లో 90 శాతం పనులు పూర్తయ్యాయి. ఇటీవల ఏర్పాటు చేసిన మీటింగ్‌లో ‘మా’ బిల్డింగ్‌ గురించి త్రీవ చర్చ జరిగింది. నా దగ్గరున్న రెండు ఆప్షన్లను వారి ముందుంచా. ఫిల్మ్‌ ఛాంబర్‌కు 20–30 నిమిషాల వ్యవధిలో చేరుకునే ప్రాంతంలో ఓ బిల్డింగ్‌ చూశాను. ఆరు నెలల్లో అది పూర్తవుతుంది. భవంతికి అది మొదటి ఆప్షన్‌. 

రెండోది.. ఫిల్మ్‌ ఛాంబర్‌ బిల్డింగ్‌ తీసేసి కొత్త బిల్డింగ్‌ కట్టబోతున్నారు. అక్కడ నేను కొంత స్థలం కొని ఇస్తాను . అక్కడ ‘మా’ ఆఫీస్‌ను రూపొందించాలి. ఇది రెండో ఆప్షన్‌.  మొదటి ఛాయిస్‌ అయితే ఆరు నెలల్లో పనైపోతుంది. రెండో ఛాయిస్‌ అయితే మూడు – నాలుగేళ్లు పడుతుంది. మేం నిర్వహించుకున్న మీటింగ్‌లో అందరూ రెండో ఆప్షన్‌ కోరుకున్నారు. ఈ రెండింటలో ఏదీ ఒకే అయినా ఆ పనులు నా డబ్బుతోనే పూర్తి చేస్తాను’’ అని చెప్పారు.

అలాగే ఏడాది కాలంలో సాధించిన ఘనతల్ని మంచు విష్ణు చెప్పుకొచ్చారు. 


1. ప్రతి నటుడికి అవకాశాలు రావాలి అన్న ఉద్దేశంతో ఒక పుస్తకం ప్రచురించి ప్రతి యాక్టివ్‌ ప్రొడ్యూసర్‌కు పంపాం. తద్వారా అవకాశాలు వచ్చే ఛాన్స్‌ ఉంది. 


2. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో అనుబంధం పెంచుకున్నాం. వారితో త్వరలో ఈవెంట్స్‌ చేయబోతున్నాం. ‘మా’ ఫండింగ్‌ కోసం రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు అబ్రాడ్‌లో భారీ ఈవెంట్స్‌ చేయబోతున్నాం. ఆ వివరాలు 20వ తేదిన వెల్లడిస్తాం.    


3. ‘మా’కు సంబంధించిన సోషల్‌ మీడియా యాప్‌ జనవరి నుంచి అందుబాటులో ఉంటుంది. 


4. మా అసోసియేషన్‌లో నటులు మాత్రమే సభ్యులుగా ఉండాలని కాస్త స్ట్రిక్ట్‌ రూల్స్‌ తీసుకొచ్చాం. 


5. నా ఒక్కడి మాటతోనే ఇక్కడ అన్నీ నడవడం లేదు. ఈసీ మెంబర్స్‌తో చర్చలు జరిపి, గొడవలు పడి నిర్ణయం తీసుకుంటున్నాం. 


6. ఇక నుంచి లైఫ్‌ మెంబర్స్‌కి మాత్రమే ఓటు హక్కుతోపాటు ఫ్రీ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఉంటుంది. అసోసియేట్‌ మెంబర్స్‌కి ఓటు హక్కు, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఉండదు. నిబంధనలకు విరుద్ధంగా ‘మా’లో మెంబర్స్‌ కానీ ఆరుగురికి ఫించన్‌ ఆపేశాం.  

7. బ్రిలియంట్‌ స్కూల్‌లో ‘మా’ సభ్యుల పిల్లలకు 30 శాతం రాయితీ ఇచ్చేలా జరిపిన చర్చలు ఫలించాయి. 


8. మోహన్‌బాబు యూనివర్శిటీలో ఇండస్ట్రీలో పని చేసే ప్రతి ఒక్కరి పిల్లలకు స్కాలర్‌షిప్‌ ఇవ్వడం జరుగుతుంది. 



Updated Date - 2022-10-14T02:57:59+05:30 IST