సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Manchu Manoj: రెండో పెళ్లి చేసుకోబోతున్నాడా? ఆ అమ్మాయి ఎవరు?

ABN, First Publish Date - 2022-09-05T03:03:07+05:30

మంచు మనోజ్ (Manchu Manoj).. ఈ పేరును పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ని, హీరోయిజాన్ని సొంతం చేసుకున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచు మనోజ్ (Manchu Manoj).. ఈ పేరును పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ని, హీరోయిజాన్ని సొంతం చేసుకున్న మంచు మనోజ్.. విడాకులతో ఒక్కసారిగా సంచలనానికి కారణమయ్యాడు. మంచు మనోజ్, ప్రణతిల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత కూడా వారిద్దరూ అన్యోన్యంగానే కనిపించారు. కానీ ఏం జరిగిందో.. ఏమో తెలియదు కానీ.. సడెన్‌గా ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లుగా ప్రకటించి షాకిచ్చారు. వారికి విడాకులై కూడా చాలా కాలం అవుతుంది. అప్పటి నుండి సింగిల్‌గానే ఉంటున్న మంచు మనోజ్.. ఇప్పుడు మరోసారి పెళ్లికి సిద్ధమవుతున్నట్లుగా కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆయన వేరొక అమ్మాయితో గణేష్ మండపం వద్ద కనిపించడంతో.. ఆయనే ఈ వార్తను కన్ఫర్మ్ చేసినట్లయింది.


ఇంతకీ మనోజ్‌తో కలిసి గణేష్ మండపం వద్ద పూజలు నిర్వహించిన అమ్మాయి ఎవరనుకుంటున్నారు? దివంగత భూమా నాగిరెడ్డి రెండవ కుమార్తె భూమా మౌనికా రెడ్డి (Bhuma Mounika Reddy). ఆమెతో కలిసి మంచు మనోజ్ పూజలు నిర్వహిస్తున్న ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతుంది. దీంతో మౌనికా రెడ్డిని.. మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా అప్పుడే ఇండస్ట్రీ వర్గాల్లో సైతం వినబడుతుండటం విశేషం. అయితే అసలు విషయం ఏమిటనేది అధికారికంగా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఈ ఫొటోతో మంచు మనోజ్ రెండో పెళ్లి త్వరలోనే అంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే.. అప్పుడెప్పుడో ‘అహం బ్రహ్మస్మి’ అంటూ ఓ పాన్ ఇండియా సినిమా ప్రకటించిన మంచు మనోజ్.. ఇంత వరకు ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్‌డేట్‌ని తెలియజేయలేదు. ఇప్పుడు పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ ఉన్న అమ్మాయితో ఇలా కనిపించడంతో.. ఆయన కూడా రాజకీయ బాట పట్టబోతున్నారా? అని కూడా చర్చలు మొదలయ్యాయి. మరి ఈ రూమర్లపై ఈ మంచు ఫ్యామిలీ హీరో ఎలా రియాక్ట్ అవుతాడో చూడాల్సి ఉంది. (Manchu Manoj Second Marriage) 







Updated Date - 2022-09-05T03:03:07+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!