మాల్దీవుల్లో ‘మాస్టర్’ భామ అందాల ఆరబోత

ABN , First Publish Date - 2022-02-03T04:04:47+05:30 IST

వెండితెరకు పరిచయమైన అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్‌ అయిన భామ మాళవికా మోహనన్‌. ఆమె నటించిన చిత్రాలు వేళ్ళపై లెక్కించవచ్చు. విజయ్‌ నటించిన ‘మాస్టర్‌’ చిత్రంలోనే ఆమె పూర్తిస్థాయి హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత ధనుష్‌తో

మాల్దీవుల్లో ‘మాస్టర్’ భామ అందాల ఆరబోత

వెండితెరకు పరిచయమైన అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్‌ అయిన భామ మాళవికా మోహనన్‌. ఆమె నటించిన చిత్రాలు వేళ్ళపై లెక్కించవచ్చు. విజయ్‌ నటించిన ‘మాస్టర్‌’ చిత్రంలోనే ఆమె పూర్తిస్థాయి హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత ధనుష్‌తో కలిసి ‘మారన్‌’ చిత్రం చేస్తోంది. కాగా ఆమె ఇప్పుడు ఎక్కడలేని క్రేజ్‌‌ని సొంతం చేసుకుంటోంది. దీనికి కారణంగా హద్దులులేని ఎక్స్‌పోజింగే. ప్రస్తుతం మాల్దీవుల్లో విహరిస్తున్న మాళవిక.. మొన్నటికి మొన్న వీపు చూపిస్తూ ప్రత్యేక ఫొటో షూట్‌ చేయగా, తాజాగా కురచ దుస్తుల్లో ఎక్స్‌పోజింగ్‌ చేస్తూ దిగిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట్‌ సందడి చేస్తున్నాయి. ఈ ఫొటోల కింద ‘సముద్రంలో నా మార్గాన్ని అన్వేషిస్తున్నాను’ అని క్యాప్షన్‌ పెట్టింది. ఈ ఫొటోలకు నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు. 



Updated Date - 2022-02-03T04:04:47+05:30 IST